Wednesday, 2 September 2026

కాణిపాకంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

 కాణిపాకంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

కాణిపాకం: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాణిపాకంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.



సుమారు 1,000 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి, కాణిపాకంలోని జనసేన పార్టీ జెండా వద్దకు చేరుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు రఘురామ్ చౌదరి, పూల ప్రభాకర్ జిల్లా కార్యదర్శులు ఏపీ శివయ్య, నెహ్రూ రాయల్, మండల అధ్యక్షులు కుమార్, పురుషోత్తం, మండల ప్రధాన కార్యదర్శులు ఉదయ్ కుమార్, పవన్, , మహేష్ స్వరో మరియు కాణిపాకం మండల నాయకులు వినోద్ తదితరుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కేక్‌ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వేముల పవన్, ఢిల్లీ సుల్తాన్, సింగిల్ విండో డైరెక్టర్ ప్రభాకర్, చంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.బంగారుపాళ్యం మండలం జనసేన పార్టీ నాయకులు పవన్, అనిల్, కిషోర్, తేజ, లోకేష్, నానాబాల తదితరులు పాల్గొన్నారు.తవణంపల్లి మండలం జనసేన పార్టీ నాయకులు ఉదయ్, చిన్న, మోహన్ బాబు, అజిత్, రమేష్, యువరాజ్, రాజేష్, అనిల్, గిరి, కుమార్ స్వామి నాయుడు, పృథ్వీ, పగల మురళి, రాధిక తదితరులు పాల్గొన్నారు.ఐరాల మండలంరాజ్‌కుమార్, వాసు రాయల్, నవీన్, రెడ్డప్ప, కాణిపాకం వినోద్, ఐరాల కిషోర్, పూల హరి, మునిరాజులు తదితరులు పాల్గొన్నారు.పూతలపట్టు నియోజకవర్గం అరుణ్, జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన ఉద్యమకారులు, సాధకులు, నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

No comments:

Post a Comment