ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
ఫ్రెండ్లీ పోలీసింగ్ పెంచండి
- ట్రాఫిక్ సిఐ నరసింహారాజు

చిత్తూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని ట్రాఫిక్ సీఐ నరసింహ రాజు అన్నారు శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎన్నికలు రానున్న నేపథ్యం వినాయక చవితి వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షణ చేపట్టాలన్నారు హై రోడ్డు చర్చి వీధి ఓటికె రోడ్డు డిఐ రోడ్డు పాత బస్టాండు మార్కెట్ చౌక్ ఎంఎస్ఆర్ సర్కిల్ వంటి రద్దీ ప్రాంతాలలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలతో మమేకమై వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ పైన ట్రాఫిక్ సిబ్బంది శ్రద్ధ వహించాలన్నారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు వినాయక చవితి రోజున ట్రాఫిక్ మళ్లింపు పైన శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు వినాయక చవితి రోజు మండపాల నిర్వాహకులు చేపట్టవలసిన చర్యల పైన అవగాహన కల్పించాలని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment