గురువులే భావి భారత నిర్మాతలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
2047 విజన్ వికసిత భారత్ లక్ష్యం నెరవేర్చే భాగస్వామ్యులు గురువులే అని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ అన్నారు. సెప్టెంబర్ 5 గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జడ్పీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ వేడుకలు విజయవంతం ఆయన సందర్భంగా ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు గ్రామంలో జన్మించి ఉపాధ్యాయుడిగా అధ్యాపకుడిగా అంచలంచలుగా ఎదిగి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఉపాధ్యాయుడిగా ఆయన సేవలను కొనియాడుతూ ఆయన జన్మదినాన్ని గురుపూజోత్సవంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆయనను నేటి గురువులు ఆదర్శంగా తీసుకొని విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గురుపూజోత్సవం రోజు చిత్తూరు జిల్లాకు చెందిన 72 మంది గురువులను ఘనంగా సన్మానించామన్నారు. వారిని అందరూ ఆదర్శంగా తీసుకొని తరగతి గదిలో ఉత్తమ పౌరులను తీర్చిదిద్ది సమాజానికి అందించాలన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఏకైక ఆయుధం గురువులే అన్నారు.

No comments:
Post a Comment