ఓలా - ఉబర్- రాపిడో- బైక్ టాక్సీ లను రద్దు చేయాలని కోరుతూ 7వ తేదీన జరిగే ధర్నా లో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలి
ఏఐటీయూసీ పిలుపు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
ఆటో డ్రైవర్ల సమస్యలతో పాటు ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ నెల 7వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద
ఏఐటియుసి ఆధ్వర్యంలో జరిగే ఆటో డ్రైవర్ల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం కాంక్షిస్తూ చిత్తూరు భగత్ సింగ్ స్టాండ్ వద్ద ఏఐటీయూసీ నాయకత్వంలో కరపత్రాలు నాయకులు విడుదల చేశారు
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఆటో డ్రైవర్ యూనియన్ గౌర అధ్యక్షులు ఎస్. నాగరాజు చిత్తూరు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.విజయ్ కుమార్ లు మాట్లాడుతూ ఓలా ఉబర్ రాపిడో బైక్ టాక్సీ లను యాప్ ఆన్లైన్ ద్వారా నడపడం వల్ల ఆటో డ్రైవర్ల బ్రతుకులు చిన్నాభిన్నమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లకు రోజువారి ఆదాయం లేక డ్రైవర్లు ఫైనాన్స్ కంపెనీల్లో కంతులు చెల్లించలేక అప్పుల పైన అప్పులు చేసి తన కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు ఇలాగనే కొనసాగితే ఆటో డ్రైవర్ల కుటుంబాలు వారి బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు మన బ్రతుకు కొరకు మన బ్రతుకు కోసం సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లు నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని గాంధీ విగ్రహం వద్ద నుండి చిత్తూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ గురుజాల జగన్మోహన్ ఎమ్మెల్యే గారికి ఆటో డ్రైవర్ల బాధలను తెలియజేసి వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, కే.మణి,వి. సి. గోపినాథ్,చిత్తూరు ఆటో డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి పి.రఘు యూనియన్ ఉపాధ్యక్షులు శివకుమార్, డిహెచ్పిఎస్ నాయకులు పి. గజేంద్రబాబు ఆటో యూనియన్ నాయకులు సామెల్, యేసు, జయ కుమార్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment