Tuesday, 1 September 2026

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బుసా నాగరాజ గౌడ్

 పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బుసా నాగరాజ గౌడ్

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 


చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షుడు బుసా నాగరాజ గౌడ్ 64వ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.



బొమ్మాయిపల్లి పంచాయతీ వజ్రాలపురం వద్ద కెఎంటీ క్రికెట్ స్టేడియంలో గణపతి విలేజ్ క్రికెట్ మహోత్సవ్–సీజన్‌-1 పోటీలు కె. మహాలక్ష్మి, తులసిరామ్, నిరిత్, పునిత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విజేతలకు రూ.14 వేల మొదటి బహుమతి, రన్నరప్‌కు రూ.7 వేల రెండో బహుమతి అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




అనంతరం క్రికెట్ క్రీడాకారుల సమక్షంలో నాగరాజ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేసి క్రీడాకారులు, అభిమానులకు పంచిపెట్టారు. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ, చిత్తూరు ఈడిగ సంఘం, బొమ్మాయిపల్లి, నలగాంపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో కూడా నాగరాజ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో రెడ్డెప్పతో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment