తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకుని అరెస్ట్ చేసిన పెనుమూరు పోలీసులు.
హత్యకు ఉపయోగించిన కోడి కత్తి, ద్విచక్ర వాహనం, స్వాధీనం.
ఒక్క రోజులోనే హత్య కేసును చేదించి ముద్దాయిని అరెస్ట్ చేసిన పోలీసులు – అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
నిందితుడు S. జోకేష్ రెడ్డి @ బాలాజీ ఎల్లంపల్లి ప్రాంతంలో నీరజాక్షి నాయుడు వద్ద హిటాచి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి తిరుపతి జిల్లా, ఆర్.సి.పురం మండలం, అనుప్పల్లి గ్రామానికి చెందిన చూడామణితో వివాహమై 13 సంవత్సరాలు అయింది. కుటుంబ విభేదాల కారణంగా సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం తన ఇంటి నుండి వెళ్లిపోయి పెనుమూరులో వేరుగా నివసిస్తున్నాడు.
02-09-2026 తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో నిందితుడి భార్య చూడామణి, నిందితుడి తండ్రి లేట్ S. చెంగా రెడ్డికి ఫోన్ చేసి, నిందితుడు ప్రతిరోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తున్నాడని, గ్రామంలో అప్పులు కూడా ఎక్కువగా చేశాడని తెలిపి, పెనుమూరులోని తమ ఇంటికి రావాలని కోరింది. అయితే నిందితుడి తండ్రి ఉదయం వస్తానని చెప్పాడు.
తన తండ్రి ఉదయం ఇంటికి వస్తే తనను మద్యం సేవించే అలవాటు, అప్పుల విషయమై మందలించి, భార్య ముందు అవమానిస్తాడని భావించిన నిందితుడు, అదే రోజు తన తండ్రిని హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో తన వద్ద ఉన్న కోడి కత్తిని తీసుకొని, తన ద్విచక్ర వాహనంపై రాత్రి సుమారు 8.00 గంటలకు పెనుమూరు నుండి తన స్వగ్రామమైన మాణిక్యరాయుని పల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు.
అక్కడ తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయంలో, నిందితుడి తండ్రి అతని మద్యపానం మరియు అప్పుల విషయమై మందలించడంతో నిందితుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ముందుగానే తీసుకువెళ్లిన కోడి కత్తితో తన తల్లి సమక్షంలోనే తండ్రి గొంతు కోసి హత్య చేశాడు. తల్లి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి హత్యకు ఉపయోగించిన కోడి కత్తిని తీసుకొని తన ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు.
ఈ ఘటనపై నిందితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనుమూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No.63/2026, సెక్షన్ 103(1) BNS కింద కేసు నమోదు చేసి చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, చిత్తూరు SDPO శ్రీ జె. వెంకటనారాయణ గారి పర్యవేక్షణలో, చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. రామచంద్ర గారి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఇన్‌స్పెక్టర్ కె. రామచంద్ర గారు పెనుమూరు ఎస్సై పి. శ్రీకాంత్, N.R.పేట SI శ్రీ వి. మణికంటేశ్వర రెడ్డి, చిత్తూరు తాలూకా SI శ్రీ వి. అశోక్ కుమార్, క్రైమ్ పార్టీ మరియు పెనుమూరు పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
03-09-2026 తేదీ సాయంత్రం సుమారు 6.00 గంటలకు పెనుమూరు మండలం, పాకాల రోడ్డు, సాయినగర్ కాలనీ, శ్రీ బాలాజీ ఆయిల్ మిల్ సమీపంలో నిందితుడు ఎస్. జోకేష్ రెడ్డి @ బాలాజీని పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుడి ఒప్పుకోలు మేరకు హత్యకు ఉపయోగించిన కోడి కత్తి, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం మరియు రక్తపు మరకలు ఉన్న నిందితుడి చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హత్య కేసును వేగంగా ఛేదించి, ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధం, ద్విచక్ర వాహనం మరియు ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. రామచంద్ర, పెనుమూరు ఎస్సై P. శ్రీకాంత్, N.R.పేట SI శ్రీ V. మణికంటేశ్వర రెడ్డి, చిత్తూరు తాలూకా PS SI V. అశోక్ కుమార్, క్రైమ్ పార్టీ మరియు పెనుమూరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS., ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
*ముద్దాయి వివరాలు:*
S. జోకేష్ రెడ్డి @ బాలాజీ, వయస్సు: 38 సం.లు, తండ్రి: లేట్ S. చెంగా రెడ్డి, లక్ష్మీనగర్ కాలనీ, పెనుమూరు టౌన్ మరియు మండలం, చిత్తూరు జిల్లా.

No comments:
Post a Comment