*వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ – రూ.13 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్న కల్లూరు పోలీసులు.*
*జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు.*
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 106 రామిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన ఎం. శంకర్ రెడ్డి ఇంటిలో 15.05.2026 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి 8 గ్రాముల బంగారు చైన్ మరియు రూ.20,000/- నగదు దొంగతనం చేసిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No.47/2026 U/s 331(4), 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా చిత్తూరు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సిబ్బందిని సంఘటనా స్థలానికి రప్పించి పరిశీలించగా, అక్కడ లభించిన వేలిముద్రలు రొంపిచెర్ల మండలం దద్దాలవారిపల్లికి చెందిన ఆవులకుంట నరేష్‌కు సంబంధించినవిగా గుర్తించారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS., గారి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్.డి.పి.ఓ శ్రీ జె.వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో, కల్లూరు సి.ఐ. శ్రీ యం.జయరామయ్య గారి పర్యవేక్షణలో, కల్లూరు ఎస్.ఐ. శ్రీ యు.వెంకటేశ్వర్లు గారు దర్యాప్తు కొనసాగించారు.
ఈ క్రమంలో 05.09.2026 సాయంత్రం 05.00 గంటల సమయంలో పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులను విచారించగా, ప్రధాన నిందితుడు ఆవులకుంట నరేష్ 2025 సంవత్సరంలో కొత్తపేటలో అబ్దుల్ మునాఫ్ ఇంటిలో, కల్లూరు–పులిచెర్ల రహదారిలో వగాళ్లవారిపల్లి సమీపంలోని ఎల్లమ్మ గుడిలో, 106 రామిరెడ్డిగారిపల్లిలో, బలిజిపల్లిలోని ఏకాంబరం ఇంటిలో దొంగతనాలకు పాల్పడినట్లు నేరం అంగీకరించాడు.
అదేవిధంగా పీలేరు పరిధిలోని ఒక ఆలయంలో, చంద్రగిరి మండలంలోని మరో ఆలయంలో కూడా దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ దొంగతనాల్లో పిన్న బోయున శ్రీనివాసులు నిందితుడు నరేష్‌కు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దొంగతనం చేసిన బంగారు వస్తువులను వివిధ బంగారు దుకాణాల్లో విక్రయించి, వచ్చిన డబ్బుతో ఇద్దరూ జల్సాలు చేసేవారని విచారణలో వెల్లడైంది.
వీరి వద్ద నుండి రూ.2,42,000/- నగదు, 78 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి మొత్తం విలువ సుమారు *రూ.13,00,000/- విలువ సొత్తును స్వాదీనం చేసుకున్నారు.
నిందితులను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న దొంగసొత్తును రికవరీ చేసిన కల్లూరు పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.
*ముద్దాయిల వివరాలు:*
1. ఆవులకుంట నరేష్, వయస్సు 36 సంవత్సరాలు, తండ్రి: సుబ్రమణ్యం, దద్దాలవారిపల్లి గ్రామం, రొంపిచెర్ల మండలం.
2. పిన్న బోయున శ్రీనివాసులు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి/సంరక్షకురాలు: సుభాషిణి, బద్వేల్, కడప జిల్లా, ప్రస్తుతం తిరుపతి అక్కరంపల్లి, మంగళం రోడ్డులో నివాసం.


No comments:
Post a Comment