వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు
చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి చిత్తూరు సహకార బ్యాంకులోని ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవంత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజమాలవేసి మంగళ హారతులు అందించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విజయాంద రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతిగా పేదల గుండెల్లో గూడు కట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. పేదల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ దేశవ్యాప్తంగా అమలవుతోందని ఆడపడుచుల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం విరివిగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన వర్ధంతి అయినా జయంతి అయినా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో అభిమానంతో వేడుకల్లో పాల్గొని ఘన నివాళులు అర్పిస్తున్నారన్నారు.
ఆయన అమలు చేసిన 108 ఆరోగ్యశ్రీ ఉద్యోగ శ్రీ వంటి పథకాలు పురుగు రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి అంటే ఆయన దూర దృష్టి, ముందుచూపు ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలన్నారు. 17 సంవత్సరాలుగా మన మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకపోయినప్పటికీ నేటికీ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు


No comments:
Post a Comment