Wednesday, 2 September 2026

వైయస్సార్ కు ఘన నివాళి

 మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి 

తవణంపల్లి సెప్టెంబర్ 2: ఫస్ట్ న్యూస్ 4 యు 

 వైయస్సార్ ఆశయ సాధనకు కృషి చేద్దాం 

 మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి  17వ వర్ధంతి సందర్భంగా తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి, మత్యం క్రాస్ వద్ద వైయస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి, గజమాలతో ఘనంగా సత్కరించి నివాళులు అర్పించారు.




 వైసీపీ మండల కన్వీనర్ సి.పి. హరి రెడ్డి  మాట్లాడుతూ మహానేత వైయస్సార్  ఆశయాలను కొనసాగించేందుకు మనమందరం ఐక్యంగా కృషి చేయాలి.

 పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైయస్సార్ చూపిన మార్గంలో ముందుకు సాగాలి.

 వైయస్సార్ ఆశయ సాధన కోసం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో మండలం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానేతకు ఘన నివాళులు అర్పించారు.

 

No comments:

Post a Comment