Monday, 7 September 2026

కాలేజీ సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలి*

 *కాలేజీ సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలి* 

*ఈవిటీజింగ్ అరికట్టాలి* 

*కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ వినతి* 

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 

వేము కాలేజీ వద్ద మరియు ఐరాల మండలంలో స్కూలు కాలేజీ సమయాల్లో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని,  అలాగే జీడి నెల్లూరు మండల కేంద్రంలో బస్ స్టాప్లవద్ద అమ్మాయిలపై ఈవిటీజింగ్ జరుగుతున్నదని వీటిపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 




ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుర్గాప్రసాద్, మసూద్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు లు కలెక్టర్ కి వివరిస్తూ  తిరుపతి రోడ్డులోని వేము కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలేజీకి వెళ్లే సమయంలోను కాలేజీ  వదిలిన తర్వాత చిత్తూర్ కి వచ్చే సందర్భంలో బస్సులు ఆపడం లేదన్నారు. ఇటు కాలేజీ యాజమాన్యం పట్టించుకోక  అటు ఆర్టీసీ బస్సులు ఆగక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఐరాల మండలంలో స్కూలు వదిలే సమయానికి వచ్చే బస్సు సమయం మార్చి 6 గంటల పైన రావడంతో విద్యార్థులు నాలుగు కిలోమీటర్లు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు స్కూల్ వదిలే సమయానికి గతంలో లాగా నడపాలని కోరారు.


   జిడి నెల్లూరు మండలం వెల్కూరు నుండి యలమరాజపురం వెళ్ళే దారిలో బట్టు కండ్రిగ అనే గ్రామం లో సాయంత్రం 5:30 నుండి 7:00 వరకు విద్యార్థునులు మరియి మహిళల లకు భద్రత కలిపించాలని ,ఈవి టీజింగ్  చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మోహన్,సాయి ప్రసాద్ పాల్గొన్నారు.

స్పందించిన కలెక్టర్*

        ఎస్ఎఫ్ఐ తెలిపిన ఫిర్యాదులు ప్రకారం వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఈవీటీజింగ్ పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు సౌకర్యార్థం బస్సులు నిలుపుదల చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ గుర్తు చేయండి అని ఎస్ఎఫ్ఐ నాయకులకు కలెక్టర్ తెలియజేశారు వెంటనే స్పందించిన కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ అభినందనలు తెలుపుతున్నది.

No comments:

Post a Comment