వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతులు ఉచితం – సింగిల్ విండో విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి సందర్భంగా మంటపాల ఏర్పాటుకు “ganeshutsav.net” ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.*
ఇంతకు ముందు వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలసి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించినది.
ప్రజలు *“ganeshutsav.net”* అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేసి దరఖాస్తును, ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
*దరఖాస్తు విధానం:*
మొదటగా దరఖాస్తు చేయదలచిన వారు *“ganeshutsav.net”* Website open చేసి New application అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
తరువాత దరఖాస్తు దారుని మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయవలయును. తరువాత సదరు మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయవలయును.
ఆ తరువాత దరఖాస్తు దారుని పేరు, అడ్రస్ మరియు కమిటి సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయవలయును.
అప్పుడు Application ID No. (Unique ID) Generate చేయబడి, సదరు దరఖాస్తు పోలీస్ శాఖ యొక్క అనుమతి కోసం వారి logins కు వెళుతుంది.
అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అనుమతించిన తరువాత ఆ వివరాలు website నందు వచ్చును. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
అనుమతికి సంభందించిన QR Code మరియు నిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనలను తెలిపే ఒక BOOKLET DOWNLOAD అగును.
*నిర్వాహకులు నిరభ్యంతర పత్రం (NOC) మరియు నియమ నిబంధనలు కూడిన పత్రాలను ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను. పోలీసువారు సందర్శన సమయములో QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.*
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రమాదాలు మరియు ఘర్షణలకు తావులేకుండా పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసు శాఖకు ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, కోరారు.

No comments:
Post a Comment