Tuesday, 1 September 2026

MP లాడ్స్ నిధుల వినియోగం లో దగ్గుమళ్ళ టాప్

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో 52% టాప్ లో నిలిచిన దగ్గుమళ్ళ 

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికి  ఏటా 5 కోట్ల రూపాయలు ఎంపీలాడ్స్ రూపంలో విడుదల చేస్తుంది.

కేంద్రం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు  రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపీలాడ్స్ వినియోగంలో 52 శాతంతో టాప్ లో నిలిచారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కడప జిల్లా ఇన్చార్జి చిట్టిబాబు కొల్లా, ఎంపీని నేడు చిత్తూరులో మర్యాదపూర్వకంగా కలిసి, 


దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు రామబద్ర, షణ్ముగం, ఓంకార్, శ్రీనివాసులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment