ఎక్సైజ్ కమిషనరేట్ తరలింపును ఆపాలి
- YCP నేత విజయానంద రెడ్డి
చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు జిల్లాలోని ఎక్సైజ్ కమిషనరేట్ ఆఫీసును తిరుపతికి తరలించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానందరెడ్డి అన్నారు. బుధవారం కటమంచి లాయస్ కాలనీలోని ఎక్సైజ్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కమర్షియల్ టాక్స్ ఆఫీస్ ను తిరుపతికి తరలించిన కూటమి ప్రభుత్వం ఆపలేకపోయిందని, ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ కమిషనరేట్ ఆఫీస్ ను తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తెలుగుదేశం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి చిత్తూరు నుండి ఏ కార్యాలయం కూడా తరలిపోకుండా ఆపుతానని గతంలో వాగ్దానం చేసి, ఇప్పుడు కార్యాలయాలు తరలిపోతున్న మౌనం వహించడానికి కారణం ఏమని సూటిగా ప్రశ్నించారు.
గతంలో వైసిపి ప్రభుత్వమే కార్యాలయాల తరలింపుకు జీవో ఇచ్చిన విషయం విధితమే అని, కానీ ఎన్నికలకు రెండు నెలలకు ముందు ఈ జీవో నివ్వడం, దీన్ని నీ వెంటనే వైఎస్ఆర్సిపి జిల్లా పెద్దల సమక్షంలో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వాటిని ఉపసంహరించడానికి ప్రయత్నాలు కొనసాగించామని, కానీ ఎన్నికలవేళ అదే జరగలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోను ఎందుకు రద్దు చేయలేక పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎక్సైజ్ కమిషనరేట్ ఆఫీస్ ను చిత్తూరు జిల్లాలోని కొనసాగించకపోతే మద్దతు తెలిపే పార్టీలు నాయకులు మేధావులతో కలిసి నిరసన పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు


No comments:
Post a Comment