Tuesday, 1 September 2026

బొమ్మసముద్రం–రామపురం స్టేషన్ల మధ్య రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద మరమ్మత్తు పనులు

బొమ్మసముద్రం–రామపురం స్టేషన్ల మధ్య రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద మరమ్మత్తు పనులు

 జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్





చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

బెంగళూరు–చెన్నై మధ్య జాతీయ రహదారిపై బొమ్మసముద్రం–రామపురం రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ. 10/1–3 వద్ద ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ నెం.52 వద్ద కొత్త పట్టాలు, ఫిట్టింగ్‌లను ఏర్పాటు చేసే పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ ట్రాక్‌ భాగంలో ఉన్న పట్టాలు, ఫిట్టింగ్‌లను మార్చేందుకు రైల్వే పరిపాలన నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఈ పనుల నేపథ్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి సెప్టెంబర్‌ 9, 2026 వరకు లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద రాకపోకలను నియంత్రించి, వాహనాల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు పనులు జరిగే కాలంలో ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి, రైల్వే అధికారులు, పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ కోరారు.


No comments:

Post a Comment