అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి
ఆనందంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలని
- బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
బంగారుపాళ్యం మండలంలోని ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంతోషకరమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. గురువారం రాత్రి బంగారుపాలెం మండల కేంద్రంలోని నూనె గుండ్ల పల్లిలో గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఆ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల కు సంబంధించిన ఏర్పాట్ల పైన అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలసి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలని, మనస్పర్ధలు, గొడవలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ఎవరైనా గొడవలకు అల్లర్లకు దౌర్జన్యాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఇంటిల్లిపాది శ్రీకృష్ణాష్టమి పర్వదిన వేడుకలను ఆనందంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు


No comments:
Post a Comment