చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి – ఐదుగురు అరెస్ట్ : సీఐ చిన్న పెద్దయ్య
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేనబండ ప్రాంతంలో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్న పెద్దయ్య తన సిబ్బందితో కలసి గురువారం దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ.10,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు వన్ టౌన్ , టూ టౌన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిగా పెంచుతున్నామన్నారు. రాత్రివేళలో గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. నిషేధిత లాటరీ టికెట్టు విక్రయం పేకాట ఆడడం వంటి కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఎవరైనా పట్టణ పరిధిలో అక్రమ జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు తెలియజేయాలని, తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సంరక్షణ పోలీసుల బాధ్యత అన్నారు.

No comments:
Post a Comment