సీఎన్ఆర్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు
గుడిపాల మండలం సిఎన్ఆర్ విద్యాసంస్థలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జీవితానికి అర్థాన్ని దిశనిచ్చేది ఉపాధ్యాయుడు అన్నారు. మనకు విద్యతోపాటు క్రమశిక్షణ ,మంచి ప్రవర్తన, నైతిక విలువలు నేర్పించేది ఉపాధ్యాయుడు అన్నారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వారి పాదాలకు ఇచ్చేగౌరవమే మన సంస్కారం అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు మాత్రమే చెప్పడు. ఆశయాన్ని నూరిపోస్తాడు ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడన్నారు. తదనంతరం కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుధ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి అర్జున్, ఎన్సిసి ఏ సి ఓ హేమంత్ కుమార్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment