*విద్యార్థులందరూ చిట్టిగులుగా మారాలి - నిరక్షరాస్యతను రూపుమాపాలి*
అక్షరాస్యత పక్షోత్సవాలలో భాగంగా ఈరోజు చిత్తూరు ప్రభుత్వ కన్నన్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు *"వయోజనులకు అక్షరాస్యత ఆవశ్యకత - సమాజంలో అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత"* అను అంశాలకు సంబంధించి చర్చ గోష్టిని ఏర్పాటు చేయడం జరిగినది .
ఈ సందర్భంగా వయోజన విద్య ఉపసంచాలకులు మహమ్మద్ ఆజాద్ వయోజనులకు అక్షరాస్యత ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరంగా చెప్పడం జరిగింది . అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులలో నిరక్షరాస్యులుగా ఉన్నవారికి మరియు విద్యార్థుల పరిసరములలో ఉన్న నిరక్షరాశులకు విద్యార్థులే చిట్టి గురువులుగా మారి చదువు నేర్పించాలని కోరారు .
ఈ చర్చ గోష్టి లో విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొనడం జరిగినది . ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీమతి నాగవల్లి గారు మాట్లాడుతూ అక్షరాస్యత అమలు కోసం ఇదివరకు అక్షర సంక్రాంతి , అక్షర తపస్మాన్ , అక్షర యజ్ఞం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్నారు . ప్రస్తుతం అక్షర ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొని తమ వంతు సహకారం ఈ కార్యక్రమానికి అందించవలసిందిగా కోరడం జరిగినది .
ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి చిట్టి గురువుగా మారి తన పరిసరములలో ఉన్న ఒక నిరక్షరాస్యునికి చదువు చెప్పాలని కోరారు . ఈ కార్యక్రమంలో వయోజన విద్య పర్యవేక్షకులు కందేశ్వర రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు . అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో అక్షరాస్యతకు సంబంధించిన నినాదాలు చెబుతూ ర్యాలీని నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .

No comments:
Post a Comment