సర్.. అభ్యంతరాల స్వీకరణకు గడువు 10 వరకు పొడిగింపు
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు
'సర్' ప్రక్రియకు సంబంధించి గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలుకు ఈనెల 10వ తేదీ వరకు అవకాశం లభించింది. గడువు పెంచిన నేపథ్యంలో ఫొటో ఓటరు జాబితాలో పేర్ల వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలున్నా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోయినా పదో తేదీ లోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చు. వీటిని పరిశీలించి పరిష్కరించేందుకు గతంలో ఈనెల 28వ తేదీ వరకున్న గడువును.. అక్టోబరు 10 వరకు పొడింగించారు. సర్ గడువు పొడిగించిన అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకుని తమ పేర్లు జాబితాల్లో ఉన్నాయో లేవో పరిశీలిం చుకోవాలని అధికారులు సూచించారు. పేరులో తప్పులు, చిరునామా మార్పులు, ఇతర వివరాల్లో సమస్యలుంటే నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు ఫారాల రూపంలో సమర్పించి సవరించుకోవచ్చన్నారు.

No comments:
Post a Comment