Tuesday, 1 September 2026

వైయస్సార్ కు ఘన నివాళులు

 వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు 

చిత్తూరు:  ఫస్ట్ న్యూస్ 4 యు 


దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి చిత్తూరు సహకార బ్యాంకులోని ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవంత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజమాలవేసి మంగళ హారతులు అందించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విజయాంద రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతిగా పేదల గుండెల్లో గూడు కట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. పేదల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ దేశవ్యాప్తంగా అమలవుతోందని ఆడపడుచుల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం విరివిగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన వర్ధంతి అయినా జయంతి అయినా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో అభిమానంతో వేడుకల్లో పాల్గొని ఘన నివాళులు అర్పిస్తున్నారన్నారు. 


ఆయన అమలు చేసిన 108 ఆరోగ్యశ్రీ ఉద్యోగ శ్రీ వంటి పథకాలు పురుగు రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి అంటే ఆయన దూర దృష్టి, ముందుచూపు ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలన్నారు. 17 సంవత్సరాలుగా మన మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేకపోయినప్పటికీ నేటికీ ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

బొమ్మసముద్రం–రామపురం స్టేషన్ల మధ్య రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద మరమ్మత్తు పనులు

బొమ్మసముద్రం–రామపురం స్టేషన్ల మధ్య రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద మరమ్మత్తు పనులు

 జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్





చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

బెంగళూరు–చెన్నై మధ్య జాతీయ రహదారిపై బొమ్మసముద్రం–రామపురం రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ. 10/1–3 వద్ద ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ నెం.52 వద్ద కొత్త పట్టాలు, ఫిట్టింగ్‌లను ఏర్పాటు చేసే పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ ట్రాక్‌ భాగంలో ఉన్న పట్టాలు, ఫిట్టింగ్‌లను మార్చేందుకు రైల్వే పరిపాలన నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఈ పనుల నేపథ్యంలో సెప్టెంబర్‌ 2 నుంచి సెప్టెంబర్‌ 9, 2026 వరకు లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద రాకపోకలను నియంత్రించి, వాహనాల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజలు, వాహనదారులు పనులు జరిగే కాలంలో ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి, రైల్వే అధికారులు, పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ కోరారు.


ఘనంగా NP రాధాకృష్ణ జన్మదిన వేడుకలు

 ఘనంగా NP రాధాకృష్ణ జన్మదిన వేడుకలు 





చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో బంగారు పాల్యం పట్టణ టిడిపి నేత NP రాధాకృష్ణ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారీ కే కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. టిడిపి నాయకులు కార్యకర్తలు భార్య సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ న చిత్రపటాన్ని బహుకరించారు. గజమాలతో ఘనంగా సత్కరించి, దుష్యాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీలో తన ప్రాణం ఉన్నంతవరకు కొనసాగుతానని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నారు. పార్టీలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎల్లవేళలా తనకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. 

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బుసా నాగరాజ గౌడ్

 పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బుసా నాగరాజ గౌడ్

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 


చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షుడు బుసా నాగరాజ గౌడ్ 64వ పుట్టినరోజు సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు.



బొమ్మాయిపల్లి పంచాయతీ వజ్రాలపురం వద్ద కెఎంటీ క్రికెట్ స్టేడియంలో గణపతి విలేజ్ క్రికెట్ మహోత్సవ్–సీజన్‌-1 పోటీలు కె. మహాలక్ష్మి, తులసిరామ్, నిరిత్, పునిత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విజేతలకు రూ.14 వేల మొదటి బహుమతి, రన్నరప్‌కు రూ.7 వేల రెండో బహుమతి అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




అనంతరం క్రికెట్ క్రీడాకారుల సమక్షంలో నాగరాజ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ కేక్‌ను కట్ చేసి క్రీడాకారులు, అభిమానులకు పంచిపెట్టారు. సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయ కమిటీ, చిత్తూరు ఈడిగ సంఘం, బొమ్మాయిపల్లి, నలగాంపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో కూడా నాగరాజ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో రెడ్డెప్పతో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రమాద ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్

రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి

ప్రమాద ప్రాంతాలను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 



జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు, ముఖ్యంగా ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ చైర్మన్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.


మంగళవారం జిల్లా సచివాలయం లోని సమావేశపు మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణ, ప్రమాదాల తీవ్రతను తగ్గించడం, జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాల మెరుగుదల తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.


ఈ సందర్బంగా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు మాట్లాడుతూ  జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ప్రాణాంతక ప్రమాదాలను మరింత తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 2025 జనవరి–ఆగస్టుతో పోలిస్తే 2026లో మొత్తం ప్రమాదాలు 462 నుంచి 425కు, 8% తగ్గగా, గాయపడిన వారి సంఖ్య 615 నుంచి 449కు, 27% తగ్గిందని తెలిపారు. ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.


ముఖ్యంగా NH-69, NH-42, NH-140 మార్గాల్లో ప్రమాదాలకు కారణాలను గుర్తించి, బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్ పర్యవేక్షణ, వాహన తనిఖీలు, వేగ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయంతో రహదారి భద్రతా లోపాలను పరిష్కరించి, గోల్డెన్ అవర్‌లో ప్రమాద బాధితులకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ప్రమాదాలు జరుగుతున్న జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి ఎన్‌హెచ్‌–69 (బెంగళూరు–పలమనేరు–చిత్తూరు–చెన్నై), ఎన్‌హెచ్‌–140 (చిత్తూరు–తిరుపతి), ఎన్‌హెచ్‌–42 (కుప్పం–పలమనేరు) మార్గాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కలెక్టర్ సమీక్షించారు. ఆయా మార్గాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేఆదేశించారు. జాతీయ రహదారులపై లైటింగ్, భద్రతా చర్యలు పటిష్టం చేయాలి




జిల్లాలోని జాతీయ రహదారులపై అవసరమైన ప్రాంతాల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. రహదారి పరిస్థితులు, సైన్‌బోర్డులు, హెచ్చరిక బోర్డులు తదితర అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


జిల్లాలోని అన్ని జాతీయ రహదారులపై సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు సమావేశంలో అధికారులు కలెక్టర్‌కు వివరించారు. తనిఖీల్లో గుర్తించిన రహదారి భద్రతా లోపాలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి ప్రాధాన్యత, గడువుతో కూడిన సమగ్ర నివేదికను సమర్పించాలని సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.


ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను సమీక్షించిన కలెక్టర్, ప్రతి ప్రమాదానికి దారితీసిన కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించాలని సూచించారు. ఒకే ప్రాంతంలో పదేపదే ప్రమాదాలు జరుగుతున్నట్లయితే ఆ ప్రాంతాన్ని గుర్తించి, ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ఇంజినీరింగ్, ట్రాఫిక్ నియంత్రణ, అవగాహన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


PM-RAHAT అమలుపై సమీక్ష

రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సహాయం అందించే PM-RAHAT పథకం అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. ప్రమాద బాధితులకు సకాలంలో అవసరమైన అత్యవసర సహాయం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గోల్డెన్ అవర్‌లోనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 104/108 అత్యవసర సేవల పనితీరుపై అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షించి, అవసరమైన చోట సేవలను మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


ప్రజల సూచనలపై స్పందించాలి.

రహదారి భద్రతకు సంబంధించి ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు, సమస్యలు, సూచనలను పరిశీలించి, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు.

జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించడం ప్రతి శాఖ బాధ్యతగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సుబ్బరాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, NHAI PD, జి వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి,EE శ్రీనివాసరావు,NHAI అధికారులు బి చందు, కార్తిక రెడ్డి, రవీందర్ రావు, ఆర్ అండ్ బి SE సురేష్ బాబు, ఆర్టిసి అధికారి పంచాయతీరాజ్ శాఖ , డి సి హెచ్ ఓ పద్మాంజలి ,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పులిగుండు పర్యాటక ప్రాంత అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

 పులిగుండు పర్యాటక ప్రాంత అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

పులిగుండును సాహస, పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి

చిత్తూరు : ఫస్ట్ న్యూస్ 4 యు 



చిత్తూరు జిల్లాలోని పులిగుండు కొండ సుమారు 1,000 అడుగుల ఎత్తుతో రెండు ప్రత్యేకమైన శిలా శిఖరాలతో కూడిన ప్రకృతి సౌందర్య ప్రాంతంగా ఉంది. సహజ శిలా నిర్మాణాలు, కొండ ప్రాంతం, పచ్చదనం, ట్రెక్కింగ్‌కు అనుకూలమైన మార్గాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత వంటి ప్రత్యేకతలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. దీంతో పులిగుండును సాహస, పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా సమగ్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

పులిగుండు ప్రాంతంలో ఇప్పటికే APTDC హరిత హోటల్ అందుబాటులో ఉండటం, పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం 79 ఎకరాల భూమిని కేటాయించడం ఈ ప్రాంత అభివృద్ధికి మరింత అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న వనరులు, సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే పులిగుండును జిల్లాలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.

1. సాహస పర్యాటక అభివృద్ధి

పులిగుండు కొండలో ఉన్న సహజ శిలా నిర్మాణాలు, ఎత్తైన శిఖరాలు, కొండ మార్గాలు ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, బౌల్డరింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే పర్యాటకుల సందర్శన ఉండటం, హరిత రిసార్ట్‌లో వసతి సదుపాయం అందుబాటులో ఉండటం ఈ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

ఈ అవకాశాలను వినియోగించుకునేందుకు:

 వివిధ స్థాయిలకు అనుగుణంగా ట్రెక్కింగ్ ట్రైల్స్‌ను అభివృద్ధి చేయడం

- సహజ శిలా నిర్మాణాలను వినియోగిస్తూ రాక్ క్లైంబింగ్, బౌల్డరింగ్ కార్యకలాపాలను అభివృద్ధి చేయడం

- రెండు శిలా శిఖరాల మధ్య సాధ్యాసాధ్యాలను పరిశీలించి జిప్‌లైన్ / రోప్ కోర్స్ ఏర్పాటు చేయడం

- సాహస కార్యకలాపాలకు అవసరమైన భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచడం

- స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ట్రెక్కింగ్, అడ్వెంచర్ గైడ్లుగా తీర్చిదిద్దడం

- నియంత్రిత విధానంలో క్యాంపింగ్, నైట్ ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాలను ప్రవేశపెట్టడం ప్రతిపాదించబడింది.


2. పర్యావరణ పర్యాటకం – నేచర్ పార్క్


పులిగుండు పరిసర ప్రాంతంలో ఉన్న సహజ శిలా నిర్మాణాలు, పచ్చదనం, కొండ ప్రాంత వాతావరణం ఎకో టూరిజం, ప్రకృతి సందర్శన మరియు నేచర్ వాక్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ప్రకృతిని పరిరక్షిస్తూ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశం ఉంది.

ఈ సహజ వనరులను పరిరక్షిస్తూ:

- స్థానిక జాతుల మొక్కలతో ఎకో పార్క్‌ను అభివృద్ధి చేయడం

- సహజ వాతావరణానికి అనుగుణంగా ఎకో-హట్స్, చెక్క కాటేజీలు ఏర్పాటు చేయడం

- సీతాకోకచిలుకల ఉద్యానవనం అభివృద్ధి చేయడం

- పక్షుల సందర్శనకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం

- సహజ వ్యూ పాయింట్లను అభివృద్ధి చేసి పర్యాటకులకు వీక్షణ సదుపాయాలు కల్పించడం

- వ్యూ పాయింట్ల వద్ద షేడ్స్, బెంచీలు, విశ్రాంతి సదుపాయాలు ఏర్పాటు చేయడం

- వర్షపు నీటి సంరక్షణ, రీచార్జ్ పిట్స్ వంటి చర్యలు చేపట్టడం

- ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి పర్యావరణహిత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం ప్రతిపాదించబడింది.


3. ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి


పులిగుండు కొండ శిఖరంపై ఉన్న శ్రీ పులిగుండేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కల్పిస్తోంది. ప్రకృతి, సాహస పర్యాటకంతో పాటు ఆలయ దర్శనాన్ని అనుసంధానం చేయడం ద్వారా పులిగుండును ఆధ్యాత్మిక–ప్రకృతి పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.


భక్తులు, పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని కల్పించేందుకు:


- ఆలయ పరిసరాలను సుందరీకరించడం

- కొండపైకి వెళ్లే మెట్లు, మార్గాలను మరమ్మతులు చేసి అభివృద్ధి చేయడం

- అవసరమైన ప్రాంతాల్లో రక్షణ రెయిలింగ్‌లు ఏర్పాటు చేయడం

- తెల్లవారుజామున, సాయంత్రం దర్శనాలకు అనువుగా లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచడం

- భక్తులు, పర్యాటకుల విశ్రాంతి కోసం సదుపాయాలు కల్పించడం

- ధ్యానం, యోగా వంటి కార్యక్రమాలకు అనువైన ప్రశాంత ప్రదేశాలను అభివృద్ధి చేయడం

- ఆలయానికి వెళ్లే మార్గాల్లో సమాచార, మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయడం ప్రతిపాదించబడింది.


4. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి


ప్రస్తుతం ఉన్న పర్యాటక ఆకర్షణలకు తోడు, ప్రభుత్వం కేటాయించిన 79 ఎకరాల భూమి అందుబాటులో ఉండటం వల్ల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.


పర్యాటకుల సౌకర్యం కోసం:


- సమగ్ర పార్కింగ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం

- టూరిస్ట్ రిసెప్షన్ మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం

- తాగునీరు, మరుగుదొడ్లు, క్లోక్‌రూమ్ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడం

- స్థానిక ఆహారాలను ప్రోత్సహించే ఫుడ్ కోర్టులు, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయడం

- ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయడం

- అత్యవసర రక్షణ, రెస్క్యూ సదుపాయాలను అందుబాటులో ఉంచడం

- చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం

- అవసరమైన ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఆధారిత లైటింగ్ ఏర్పాటు చేయడం

- డిజిటల్ సమాచార సదుపాయాలను మెరుగుపరచడం ప్రతిపాదించబడింది.


5. విద్యుత్ దీపాలు మరియు లైటింగ్ సదుపాయాల మెరుగుదల


పులిగుండు ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల సదుపాయం పర్యాటకులు, భక్తులకు రాత్రి సమయంలో కూడా సురక్షితంగా సంచరించేందుకు ఉపయోగపడుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో దీపాల మరమ్మతులు, పునరుద్ధరణ మరియు అదనపు లైటింగ్ అవసరం ఉంది.


పర్యాటకుల భద్రత, ఆలయ దర్శనాలు మరియు రాత్రి సమయంలో ప్రాంతం ఆకర్షణీయంగా కనిపించేలా:


- ఇప్పటికే ఉన్న విద్యుత్ దీపాల మరమ్మతులు, పునరుద్ధరణ చేపట్టడం

- అవసరమైన ప్రాంతాల్లో అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం

- కొండ మార్గాలు, మెట్లు, వ్యూ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో తగిన లైటింగ్ కల్పించడం

- విద్యుత్ దీపాల నిర్వహణకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడం


వంటి చర్యలను చేపట్టేందుకు సుమారు రూ.10 లక్షలతో విద్యుత్ దీపాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు చర్యలు తీసుకుంటున్నారు.


6. వసతి సౌకర్యాల అభివృద్ధి


పులిగుండు ప్రాంతంలో ఇప్పటికే APTDC హరిత హోటల్ అందుబాటులో ఉండటం వల్ల పర్యాటకులకు వసతి కల్పించేందుకు ప్రాథమిక సదుపాయం ఇప్పటికే ఉంది. దీనిని ఆధునీకరించడం ద్వారా పర్యాటకుల బసను మరింత సౌకర్యవంతంగా చేయవచ్చు.


అదనంగా, ప్రకృతి మరియు సాహస పర్యాటకానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని:


- టెంట్ క్యాంపింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం

- గ్లాంపింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడం

- ఎకో-కాటేజీలు, చెక్క కాటేజీలను ఏర్పాటు చేయడం

- కుటుంబాలు, యువత, సాహస పర్యాటకులకు అనుగుణంగా వసతి విభాగాలను అభివృద్ధి చేయడం

- పరిసర గ్రామాల్లో హోమ్‌స్టేలను ప్రోత్సహించడం


ప్రతిపాదించబడింది.


7. భద్రతా సదుపాయాల అభివృద్ధి


పులిగుండు కొండ ప్రాంతంలో సహజ శిలలు, ఎత్తైన ప్రాంతాలు, మెట్లు, ట్రెక్కింగ్ మార్గాలు ఉండటంతో పర్యాటకుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న మెట్లు, రెయిలింగ్‌లు, మార్గాలను మరింత బలోపేతం చేయడం ద్వారా సురక్షితమైన పర్యాటక అనుభవాన్ని కల్పించవచ్చు.


అందుకు:


- మెట్లు, రెయిలింగ్‌లను మరమ్మతులు చేసి బలోపేతం చేయడం

- ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం

- ట్రెక్కింగ్ మార్గాల్లో అవసరమైన చోట భద్రతా తాళ్లు, రక్షణ పరికరాలు ఏర్పాటు చేయడం

- శిక్షణ పొందిన ట్రెక్కింగ్ గైడ్లు, రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచడం

- CCTV కెమెరాలు, కంట్రోల్ & మానిటరింగ్ రూమ్ ఏర్పాటు చేయడం

- అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయడం

- మార్గ సూచికలు, దూర సూచికలు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ప్రతిపాదించబడింది.


8. స్థానిక ఉపాధి మరియు సమాజ భాగస్వామ్యం


పులిగుండును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా పరిసర గ్రామాల యువత, మహిళలు మరియు స్థానిక ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.


పర్యాటక కార్యకలాపాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు:


- స్థానిక యువతకు టూరిజం, ట్రెక్కింగ్ గైడ్‌లుగా శిక్షణ ఇవ్వడం

- అడ్వెంచర్ కార్యకలాపాలకు సహాయక సిబ్బందిగా శిక్షణ ఇవ్వడం

- మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా స్థానిక ఆహార, హస్తకళల స్టాళ్లను ఏర్పాటు చేయడం

- స్థానిక సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం

- హోమ్‌స్టేలు, ఎకో-కాటేజీలు, టెంట్ వసతి నిర్వహణలో స్థానికులకు అవకాశాలు కల్పించడం

- టీ, కాఫీ, రిఫ్రెష్‌మెంట్ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించడం ప్రతిపాదించబడింది.


9. అభివృద్ధి నమూనా – ప్రభుత్వ, PPP భాగస్వామ్యం


ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కోసం కేటాయించిన 79 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో పులిగుండు ప్రాంతాన్ని సమగ్ర మాస్టర్ ప్లాన్ ఆధారంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.


ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానాన్ని పరిశీలించవచ్చు.


అదేవిధంగా ట్రెక్కింగ్, బౌల్డరింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాల అభివృద్ధికి అనుభవజ్ఞులైన సంస్థలు, మౌంటెనీరింగ్ క్లబ్‌లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించవచ్చు.



10. దశలవారీ అభివృద్ధి


పులిగుండు ప్రాంత అభివృద్ధిని దశలవారీగా చేపట్టడం ద్వారా అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను క్రమంగా పెంచవచ్చు.


మొదటి దశ – ప్రాథమిక సదుపాయాలు


- విద్యుత్ దీపాల మరమ్మతులు, పునరుద్ధరణ

- రోడ్లు, మెట్లు, రెయిలింగ్‌ల అభివృద్ధి

- తాగునీరు, మరుగుదొడ్లు

- పార్కింగ్

- సూచిక బోర్డులు

- భద్రతా సదుపాయాలు


రెండో దశ – పర్యాటక ఆకర్షణలు


- ట్రెక్కింగ్ ట్రైల్స్

- రాక్ క్లైంబింగ్, బౌల్డరింగ్

- జిప్‌లైన్ / రోప్ కోర్స్

- ఎకో పార్క్

- బటర్‌ఫ్లై పార్క్

- వ్యూ పాయింట్లు

- టెంట్ క్యాంపింగ్, గ్లాంపింగ్


మూడో దశ – సమగ్ర పర్యాటక గమ్యస్థానం


- హరిత హోటల్ ఆధునీకరణ

- ఎకో-కాటేజీలు, హోమ్‌స్టేలు

- ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్

- స్థానిక ఆహారం, హస్తకళల మార్కెట్

- డిజిటల్ టూరిజం ప్రచారం

- PPP భాగస్వామ్యాల ద్వారా దీర్ఘకాలిక నిర్వహణ


---


11. ఆశించబడే ఫలితాలు


ప్రస్తుతం ఉన్న సహజ, ఆధ్యాత్మిక, పర్యాటక వనరులకు అవసరమైన మౌలిక వసతులను జోడించడం ద్వారా పులిగుండును:


- చిత్తూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయవచ్చు.

- సాహస, పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ఒకే ప్రాంతంలో అనుసంధానం చేయవచ్చు.

- స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచవచ్చు.

- స్థానిక ఆహారం, హస్తకళలకు మార్కెట్ కల్పించవచ్చు.

- పరిసర గ్రామాల్లో హోమ్‌స్టేలు, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు.

- పర్యాటకుల రాక పెంచడం ద్వారా స్థానిక ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయవచ్చు.

- పులిగుండుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక పర్యాటక గుర్తింపు తీసుకురావచ్చు.


ముగింపు


సహజ శిలా నిర్మాణాలు, సాహస పర్యాటకానికి అనుకూలమైన కొండ ప్రాంతం, శ్రీ పులిగుండేశ్వర స్వామి ఆలయం, ఇప్పటికే ఉన్న APTDC హరిత హోటల్, ప్రభుత్వం కేటాయించిన 79 ఎకరాల భూమి వంటి వనరులు పులిగుండు అభివృద్ధికి బలమైన పునాదిగా ఉన్నాయి. వీటికి అవసరమైన విద్యుత్ దీపాలు, రహదారులు, మెట్లు, రెయిలింగ్‌లు, తాగునీరు, పార్కింగ్, భద్రత, వసతి వంటి మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ, సాహస, పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటక కార్యకలాపాలను అనుసంధానం చేయడం ద్వారా పులిగుండును చిత్తూరు జిల్లాకే తలమానికంగా నిలిచే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయవచ్చు.


ఈ దిశగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో అవసరమైన చర్యలను చేపడుతూ, పులిగుండు అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి.



MP లాడ్స్ నిధుల వినియోగం లో దగ్గుమళ్ళ టాప్

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో 52% టాప్ లో నిలిచిన దగ్గుమళ్ళ 

చిత్తూరు: ఫస్ట్ న్యూస్ 4 యు 

నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికి  ఏటా 5 కోట్ల రూపాయలు ఎంపీలాడ్స్ రూపంలో విడుదల చేస్తుంది.

కేంద్రం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు  రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపీలాడ్స్ వినియోగంలో 52 శాతంతో టాప్ లో నిలిచారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కడప జిల్లా ఇన్చార్జి చిట్టిబాబు కొల్లా, ఎంపీని నేడు చిత్తూరులో మర్యాదపూర్వకంగా కలిసి, 


దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు రామబద్ర, షణ్ముగం, ఓంకార్, శ్రీనివాసులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.