విదేశీయుల వసతి వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి - చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి
విదేశీయులకు ఆశ్రయం కల్పించే యాజమాన్యాలు వారి వివరాల నమోదులో నిర్లక్ష్యం వద్దు.... 24 గంటల్లో సమాచారం అందించాలి..జిల్లా ఎస్పీ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు జిల్లా లో విదేశీయులకు ఆశ్రయం కల్పించే హెూటల్స్, గెస్ట్‌హౌస్‌లు, గృహ యజమాన్యాలు, ఆసుపత్రులు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, విద్యాసంస్థలు ఇతర సంస్థల నిర్వాహకులు, యాజమాన్యాలు తప్పనిసరిగా వారి వద్ద ఆశ్రయం పొందే విదేశీయుల రాక, బస మరియు బయలుదేరే వివరాలను నిర్దేశిత విధానంలో అన్లైను డిజిటైలేజను ద్వారా ఎఫ్.ఆర్.ఆర్.ఓ. లో తప్పనిసరిగా నమోదు చేసి (ఫారనర్స్ రీజనల్ రిజిస్ట్రేషను ఆఫీసరు)/ఎఫ్.ఆర్.ఓ. (ఫారనర్స్ రిజిస్ట్రేషను ఆఫీసరు/సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు) వారికి 24గంటల సమయంలోగా తెలియజేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ – వివిధ దేశాల నుంచి జిల్లాకు వివిధ పనులు, విద్య, వైద్యం, పర్యటన, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే విదేశీయులు, పాస్‌పోర్టు, వీసా, వ్యక్తిగత వివరాలు, వసతి వివరాలు, వచ్చిన తేదీ తదితర నిర్దేశిత వివరాలను 'ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫార్ నర్స్ చట్టం - 2025, సెక్షన్ 8 ప్రకారం తప్పనిసరిగా *https://indianfrro.gov.in* వెబ్ సైట్ ద్వారా నమోదుచేసి 24గంటలలోగా ఎఫ్.ఆర్.ఆర్.ఓ/ఎఫ్.ఆర్.ఓ. కార్యాలయాలకు సకాలంలో అందించాల్సిన బాధ్యత వారికి వసతి, ఆశ్రయం కల్పించే సంస్థలపై ఉందని ఎస్పీ గారు తెలిపారు. సంబంధిత ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేయడంలో సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయరాదని ఎస్పీ గారు సూచించారు.
*నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు*
విదేశీయుల వివరాలను నిర్దేశిత *Form III/Form 'C'* పోర్టల్ ద్వారా నమోదు చేయకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యవహరించినట్లయితే యాజమాన్యాలపై '*ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫార్నర్స్ చట్టం - 2025, సెక్షన్ 23(బి*) ప్రకారం *రూ.50 వేలు నుండి రూ. 1లక్ష వరకు జరిమానా లేదా 2 సం.లు నుండి 7 సం.లు* వరకు జైలు లేదా రెండూ విధించే అవకాశం ఉందని ఎస్పీ గారు తెలిపారు. అందువల్ల హోటల్ యాజమాన్యాలు, గెస్ట్‌హౌస్‌లు, వ్యక్తిగత గృహ యజమానులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు ఇతర సంబంధిత సంస్థలు విదేశీయులకు వసతి లేదా సేవలు కల్పించే సమయంలో చట్టపరమైన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ గారు సూచించారు.
జిల్లాకు విచ్చేసే విదేశీయులు భారతదేశ చట్టాలను గౌరవించాలని, చెల్లుబాటులో ఉన్న వీసా, పాస్‌పోర్టు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఓ.సి.ఐ. (ఓవరిసిస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) భారతీయులు, దేశంలో నిర్వహించే ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని, ఓటు వేయరాదని, వ్యవసాయ భూములను కొనుగోలు చేయరాదని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపిఎస్ గారు తెలిపారు.

No comments:
Post a Comment