Friday, 2 October 2026

రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు జీడి నెల్లూరు గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఎంపిక - ప్రిన్సిపాల్ ప్రభావతి

 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు జీడి నెల్లూరు గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఎంపిక 

- ప్రిన్సిపాల్ ప్రభావతి 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు 


గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని సర్వే రెడ్డి పల్లి బాలికల గురుకుల పాఠశాల చెందిన  5 మంది బాలికలు బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ తిరుపతిలోని సుబ్బయ్యా కాలనీ అవిలాలా బాక్సింగ్ కేంద్రంలో అండర్ -17, అండర్- 19 విభాగంలో నిర్వాహకులు సురేంద్రన్ బాబు ఆధ్యర్యంలో ఈ పోటీలు నిర్వహించారని తెలిపారు. ఇందులో బాలికల గురుకుల పాఠశాల చెందిన  అండర్ -17 విభాగంలో నవ్య (10వ తరగతి) అనుష్క (10వ తరగతి) అండర్- 19 విభాగంలో జననీ (10వ తరగతి) స్నేహలత (9 వ తరగతి) ప్రీతి (10 వ తరగతి) అనే 5 మంది విద్యార్థినులు బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీలలో గెలుపొంది ఈనెల 9 10 11, తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.  విజేతలను, వ్యాయామ ఉపాధ్యాయురాలు రమీజా ను , విజయలక్ష్మి లను ప్రిన్సిపాల్ ప్రభావతి, వైస్ ప్రిన్సిపాల్ దమయంతి అభినందించారు.

No comments:

Post a Comment