Monday, 12 October 2026

పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై షార్ట్ ఫిల్మ్ పోటీలకు బహుమతి చెక్కుల ప్రధానం చేసిన కలెక్టర్

పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై షార్ట్ ఫిల్మ్ పోటీలకు బహుమతి చెక్కుల ప్రధానం చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా కలెక్టర్/మెజిస్ట్రేట్ శ్రీ సుమిత్ కుమార్ గారీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన జిల్లాలో ఉన్న 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు గాను పి సి పి ఎన్ డి టి షార్ట్ ఫిలిం పోటీలలో చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల  PCPNDT (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques) కార్యక్రమంలో  పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల నుంచి 14 షార్ట్ ఫిల్మ్‌లు, నగరి నుంచి 1 షార్ట్ ఫిల్మ్, సావిత్రమ్మ కళాశాల నుంచి 4 షార్ట్ ఫిల్మ్‌లు కలిపి మొత్తం 19 షార్ట్ ఫిల్మ్‌లు వచ్చాయి.


ఈ షార్ట్ ఫిల్మ్‌లను లైన్ డిపార్ట్మెంట్స్ అగు ఐసిడిఎస్, వైద్యశాఖ, విద్యాశాఖ అధికారులు పరిశీలించి, PCPNDT చట్టం, ఆడపిల్లల సంరక్షణ, లింగ వివక్ష నిర్మూలన, ఆడ శిశువుల ప్రాధాన్యత తదితర అంశాలపై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన చిత్రాలను పరిశీలించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ, సమాజంలో ఆడపిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.


 ఈ పోటీలలో మొదటి ప్రైజుగా పివికేఎన్ కళాశాలకు చెందిన k. పవన్ కుమార్ &టీమ్ కు మొదటి బహుమతిగా 30,000/-రూపాయలు, మరియు సావిత్రమ్మ ప్రభుత్వ కళాశాలకు చెందిన k.శ్రీవల్లి& టీమ్ కు రెండవ బహుమతిగా 20,000/-, రూపాయలు, ఈ కళాశాలకే చెందిన మూడవ ప్రైజు R.S. షాలిని&టీమ్ కు 10,000/-రూపాయలు చొప్పున చెక్కులు ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ఇష్యూ చేయడమైనది.   ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ పద్మాంజలి దేవి,ఐసిడిఎస్ పిడి శ్రీమతి శ్యామ సుగుణ కుమారి, పివికేన్ కళాశాల మహిళా వింగ్ లెక్చరర్ శ్రీమతి భ్రమరాంబ, సావిత్రమ్మ కళాశాల ఉమెన్ వింగ్ లెక్చరల్ డాక్టర్ ఉషారాణి, డెమో ఇన్చార్జి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment