పెను తుఫాను ముప్పు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
తవణంపల్లి, అక్టోబర్ 25: తీరంవైపు దూసుకొస్తున్న పెను తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తవణంపల్లి తహసీల్దార్ మాధవరాజు కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీవ్రమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మండల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ మాధవరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment