చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కె. వెంకటప్ప
కె. వెంకటప్ప ఈరోజు చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
డి.ఎస్పీ గారు కడప జిల్లా భాకరాపేటలోని 11వ బెటాలియన్‌లో డీఎస్పీ (అసిస్టెంట్ కమాండెంట్)గా విధులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ బదిలీల్లో భాగంగా ఆయనను చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా నియమించడంతో, ఈరోజు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
1996వ ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన శ్రీ కె. వెంకటప్ప పోలీసు శాఖలో వివిధ జిల్లాల్లో సేవలందించారు. తన సుదీర్ఘ సేవాకాలంలో పలు బాధ్యతలు నిర్వహించి, ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 2025లో డీఎస్పీగా పదోన్నతి పొందారు.
బదిలీకి ముందు భాకరాపేట 11వ బెటాలియన్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ప్రస్తుతం చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.

No comments:
Post a Comment