Monday, 5 October 2026

ఆర్టిఐ కమిషన్ గుడిపాల ఎంపీడీవోకు నోటీసు

 ఆర్టిఐ కమిషన్ గుడిపాల ఎంపీడీవోకు నోటీసు


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

గుడిపాల: సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారంపై ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదంటూ వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంలో గుడిపాల ఎంపీడీవోను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.


గుడిపాల ఎంపీడీవో కార్యాలయానికి ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఎం. నంబిక రాజ్‌కు పూర్తి సమాచారం అందకపోవడంతో ఆయన సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ కేసు నం.16786/SIC-IR/2023లో 07-03-2024న పూర్తి సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.


అయితే సదరు ఆదేశాలను పూర్తిగా అమలు చేయలేదని పేర్కొంటూ నంబిక రాజ్ మళ్లీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో 05-10-2026న గుడిపాల ఎంపీడీవోకు కమిషన్ నోటీసులు అందాయి. అక్టోబర్ 13న ఉదయం 11 గంటలకు జరిగే విచారణకు ఎంపీడీవో హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.


ఇప్పటికే ఒకసారి పూర్తి సమాచారం అందించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, తాజా విచారణలో ఈ వ్యవహారంపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

No comments:

Post a Comment