బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు 50% పరిమితిని మించోద్దని హైకోర్టు కొట్టివేయడం విచారకరం - జ్ఞాన జగదీష్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు 50% పరిమితిని మించోద్దని హైకోర్టు కొట్టివేయడం విచారకరం. అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఙెఎసి అధ్యక్షులు జ్ఞాన జగదీష్ అన్నారు. EWC అగ్రవర్ణ పేదలకు జీవో నెంబర్ 103 రాజ్యాంగ సవరణ చేసి 10% రిజర్వేషన్ ఇవ్వటం దానిని సుప్రీంకోర్టు సమర్ధించడం ద్వారా రిజర్వేషన్ 50% పరిమితి ఎప్పుడో దాటిపోయింది... తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలులో ఉన్నది బీసీల విషయంలో మాత్రం ఈ నిబంధనలు గుర్తుకు రావటం దురదృష్టకరం అన్నారు.
హైకోర్టు తీర్పు పై ప్రభుత్వం సుప్రీం కోర్టు కెళ్లడం సరికాదని,కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుప్రీం 50 శాతం పరిమితిని ఎత్తేపించేలా పార్లమెంటు చే చట్టం చేయించి, బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఙెఎసి అధ్యక్షులు జ్ఞాన జగదీష్ కోరారు..
ఇవాళ స్థానిక కార్యాలయంలో "34 శాతం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు- కొట్టేసిన హైకోర్టు తీర్పు" అనే అంశంపై జరిగిన మీడియా సమావేశం లో ఆమేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా వారు గత ప్రభుత్వం ఎప్పటి నుండో స్థానిక సంస్థలలో అమలవుతూ వస్తున్న 34 శాతం బీసీ రిజర్వేషన్లను,24 శాతమే అమలు చేసి బీసీలకు అన్యాయం చేసిందని కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు విమర్శిస్తూ వచ్చిందన్నారు. దానికి కారణం గతంలో సుపరిపాల అందించిన ప్రభుత్వాలు ,సుప్రీం 50 శాతం పరిమితేనని తెలిసి కూడా, నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ పరిమితిని ఎత్తేపించేందుకు ఎట్టి చర్యలు గైకొనక పోవడం విచారకరమన్నారు. ఇప్పుడు అదే కారణం చూపి తమ ఎన్నికల వాగ్దానమైన స్థానిక సంస్థల 34 శాతం బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేస్తే, మళ్లీ తిరిగి ఏ సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లకు ఆటంకంగా పరిమితి విధించిందో, అదే సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఇప్పుడు వెళ్తామనడం ఏమాత్రం సహేతుకం కాదన్నారు. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం 50 శాతం పరిమితిని ఎత్తేపించేలా కేంద్రాన్ని ఒప్పించి,ఆయా రాష్ట్రాలలో బీసీల జనాభా దామాషా మేరకు ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచుకునేలా పార్లమెంటుచే చట్టం చేయించాలని,ఆపై న్యాయపర చిక్కులేవీ రాకుండా రాజ్యాంగం షెడ్యూల్-9 లో పెట్టించి సంపూర్ణ రక్షణ కల్పించాలన్నారు.
స్థానిక సంస్థలలో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిత్యం ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు అంటూనే,చట్టబద్ధ రిజర్వేషన్లకు సహకరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో పాలక-ప్రతిపక్షాల సమస్యగా దీన్ని చిత్రీకరించి,ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం కాదని,రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల ప్రధాన సమస్యలు-వాటి పరిష్కారాలు అందరికీ తెలిసి కూడా బీసీల జీవితాలతో చెలగాటమాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తగదన్నారు. అలాగే పార్టీలపరంగా బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తామనడం సరికాదని... జనాభా దామాషా మేరకు చట్టపరంగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు జరపాలని కోరుతున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట 3,4 శాతం కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం,పార్లమెంటుచే రెండు రోజుల్లో చట్టం చేపించి దేశవ్యాప్తంగా అమలు చేస్తుందన్నారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిని మరెవ్వరూ-ఎప్పటికీ మార్చడానికి వీలు లేకుండా ఆగమేఘాల మీద 24 గంటల్లో పార్లమెంటుచే చట్టబద్ధత చేకూర్చారన్నారు. చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లు తలుచుకుంటే 34 శాతం బీసీ రిజర్వేషన్ల ఏర్పాటు సాధ్యంకానిదేమీ కాదన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే బీసీల అభివృద్ధని నమ్మే, 164 సీట్లు ఇచ్చి గెలిపించిన రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్రాన్ని ఒప్పించి స్థానిక సంస్థలలో బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని జ్ఞానజగదీష్ పునరుద్ఘాటించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీసీ నాయకులు పాల్గొని ప్రసంగించారు.

No comments:
Post a Comment