ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్
- తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
ఇద్దరు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిపై దాడి చేసి ఇనుప రాడుతో తల పై గాయపరచిన ఘటన పైన బాధితుడు అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బుధవారం ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి నివారణకు తరలించినట్లు తవనంపల్లి ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఆయన కదరం మేరకు సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉప్పొంక గ్రామానికి చెందిన హేమచంద్ర అనే వ్యక్తి బైక్ పైన అరగొండ నుండి వెళ్తూ ఉండగా వెంగంపల్లి మాదిగ వాడకు చెందిన మధు, వడ్డీ వాని చెరువు కు చెందిన లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి ఇనుప రాడ్తో హేమచంద్ర పైన దాడి చేసి గాయపరచడంతో తలకు తీవ్ర గాయాలయింది. ఈ ఘటన పైన హేమచంద్ర అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బుధవారం ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా, హేమచంద్ర భార్య సుప్రియ కు మధుకు మధ్య గత మూడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడి ఇద్దరు సన్నిహితంగా ఉండడంతో హేమచంద్ర మధు తో మాట్లాడకూడదు అని తన భార్యను హెచ్చరించడంతో కోపానికి లోనైనా మధు తన స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి దారి కాపు కాచి హేమచంద్ర పైన దాడి చేసినట్లు తెలిపారు అన్నారు. హత్యాయత్నం కేసు పైన ఇద్దరు ముద్దాయిలను రిమాండ్ చేసినట్లు తెలిపారు

No comments:
Post a Comment