Tuesday, 6 October 2026

ఎస్‌ఎస్‌సీ–2027 ఫలితాల మెరుగుదలకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక;జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్‌ఎస్‌సీ–2027 ఫలితాల మెరుగుదలకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

పాఠశాల విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నది

- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్,6:

పాఠశాల విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నది అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు, మంగళవారం జడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమగ్ర శిక్షణ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ సుమిత్  కుమార్, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో డిఇఓ లక్ష్మీనారాయణ, ఎస్ ఎస్ పి ఓ ప్రతినిధి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి, ఎస్‌ఎస్‌సీ–2027లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి అధికారి, ఉపాధ్యాయుడు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు.తక్కువ స్థాయి విద్యా ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను ముందుగానే గుర్తించి, వారికి విద్యార్థి స్థాయి ట్రాకింగ్ షీట్లను రూపొందించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని  ముఖ్యంగా 6 నుంచి 10వ తరగతి వరకు గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ప్రాథమిక భావనలను బలోపేతం చేయాలని తెలిపారు.విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు వారానికొకసారి స్లిప్ టెస్టులు, నెలవారీ యూనిట్ పరీక్షలు, త్రైమాసిక కామన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు, పాఠశాలల పనితీరును ట్రాకింగ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.తక్కువ పనితీరు కనబరుస్తున్న విద్యార్థులకు ప్రతిరోజూ ఒక గంట ప్రత్యేక నివారణాత్మక తరగతులు, సెలవులు మరియు వారాంతాల్లో ప్రత్యేక కోచింగ్ నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు కనీస అభ్యసన ఫలితాలను సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని అన్నారు.



గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఉపయోగించుకుని మండల స్థాయిలో సబ్జెక్ట్ వారీగా మెంటరింగ్ నిర్వహించాలని, ప్రశ్నా బ్యాంకులు, నమూనా సమాధానాలను సిద్ధం చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు వారానికొకసారి స్లిప్ టెస్టులు, నెలవారీ యూనిట్ పరీక్షలు, త్రైమాసిక కామన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు, పాఠశాలల పనితీరును ట్రాకింగ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులను వెంటనే సంప్రదించి, దీర్ఘకాలికంగా గైర్హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ విద్యా కార్యక్రమాలను పర్యవేక్షించాలని, విద్యార్థుల పురోగతిని వారానికొకసారి సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులకు స్పష్టమైన విద్యా లక్ష్యాలను నిర్దేశించి, క్రమం తప్పకుండా తరగతి గది పరిశీలనలు నిర్వహించాలని తెలిపారు.

తక్కువ పనితీరు కనబరుస్తున్న మండలాలు, పాఠశాలలను గుర్తించి ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపట్టాలని, అవసరమైన చోట తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల హాజరు, చదువు, పరీక్షల సన్నద్ధతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవోలు ఇందిర, మహేశ్వరరావు, ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు తేజ మూర్తి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment