Monday, 5 October 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

 - డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష 

- మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ , త్రిబుల్ రైడింగ్ చేయరాదు 

- రోడ్డు నిబంధనలు పాటించాలి 

- ట్రాఫిక్ సీఐ నరసింహారాజు 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు :

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే భారీ జరిమానా తోపాటు జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ సీఐ నరసింహారాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాహనదారులు పాటించకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదివేల రూపాయలు జరిమానా , రెండవసారి చేస్తే 15,000 రూపాయలు జరిమానా తో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని వాహనాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడప రాదని విజ్ఞప్తి చేశారు. లోడింగ్ అన్లోడింగ్ విషయంలో ఉదయం ఏడు గంటల లోపల భారీ వాహనాలు నగరంలో అనుమతిస్తామని 7 గంటల పైన భారీ వాహనాలు నగరం లోపలికి రాకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా తప్పదు అన్నారు. తల్లితండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలు జరిగితే జరిమానాతో పాటు వాహన యజమాని పైన కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు. రాష్ డ్రైవింగ్ త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. వాహనదారులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. ప్రమాద రహిత నగరాన్ని రూపొందించడానికి ట్రాఫిక్ పోలీసులకు సహకరించి వాహనదారులు భాగస్వామ్యం కావాలన్నారు.

No comments:

Post a Comment