ప్రభుత్వ స్థలం ఆక్రమణ - అక్రమంగా నిర్మిస్తున్న భవనం
- సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు నగర పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించినా ఆక్రమణ గురవుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు.
శుక్రవారం చిత్తూరు లో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగర పరిసర ప్రాంతాల్లో భూములు విలువ అమాంతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ స్థలం ఎక్కడ కనిపించినా ఆక్రమణ గురవుతున్నదని రెవెన్యూ అధికారులు చూస్తున్నట్లు ఎవరు ఇస్తున్నారని విమర్శించారు. నగరంలో ఇళ్ల స్థలాలు లేక పేదలు వేలాది మంది ఉన్నారని వారికి వారికి స్థలాలు ఇవ్వాలని అనేక దఫాలుగా రకరకాల ఆందోళన చేసి డిమాండ్ చేస్తున్న ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడున్నాయని ఎదురు ప్రశ్నిస్తున్న రెవెన్యూ అధికారులు ఈ విధంగా ఎక్కడ స్థలం కనిపించిన ఆక్రమిస్తుంటే అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం లీజుకు ప్రభుత్వ స్థలాన్ని నేషనల్ గుర్తింపు కలిగిన పార్టీలకు కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని చెప్పినా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన కింది స్థాయిలో రెవెన్యూ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం దారుణం అన్నారు. సంవత్సరాలకు కొద్ది వాయిదాలు వేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడం లేదు. ప్రభుత్వ స్థలాలు ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు మాట్లాడకపోవడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మురుకంబట్టు బైపాస్ లో లేఔట్ దగ్గర ప్రభుత్వ స్థలం ఉంటే ఆ స్థలంలో దర్జాగా ఇంటి భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ స్థలం ప్రభుత్వ స్థలమని గతంలో రెవెన్యూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమైందేమో కానీ ఇప్పుడు దర్జాగా భవనిర్మానం జరుగుతున్నది. ఇలాంటివి చిత్తూరు నగర పరిసర ప్రాంతాల్లో అనేకం జరుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తారు లేనిపక్షంలో ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు

No comments:
Post a Comment