ఈ నెల 31వ తేదీలోగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎం పి టి సి ఎన్నికల కౌంటింగ్ కు సంబందించి స్థానిక చిత్తూరు లోని పి వి కె ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అని ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్*
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
మున్సిపల్, జెడ్పీటీసీ/ఎం పి టి సి ఎన్నికలకు సంబంధించి స్థానిక చిత్తూరు లోని పి వి కె ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆదివారం చిత్తూరు పట్టణంలోని పీవీకేఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్, జెడ్పీటీసీ/ఎం పి టి సి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, చిత్తూరు ఆర్డీవోల శ్రీనివాసులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అనువుగా కౌంటింగ్ హాళ్లు, గదులు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి భోజన సదుపాయం, తాగునీటి వసతి కల్పించడంతో పాటు, కేంద్రం వద్ద రిసెప్షన్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించే సమయంలో ఏ పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఏ కౌంటింగ్ టేబుల్ వద్దకు పంపించాలనే విషయంలో స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, తరలింపు ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బందికి వసతులు, ఇతర ఏర్పాట్లన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ఎన్నికల కౌంటింగ్‌కు సిద్ధంగా ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

No comments:
Post a Comment