Thursday, 8 October 2026

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP SPECIAL TET – 2026)కు పటిష్ట ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP SPECIAL TET – 2026)కు పటిష్ట ఏర్పాట్లు

- జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్





చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 8,:


ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP SPECIAL TET – 2026)ను చిత్తూరు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సమయంలో  కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్   సమావేశ మందిరంలో 


AP SPECIAL TET – 2026 పరీక్షలు 11-10-2026 నుంచి 15-10-2026 నిర్వహణపై ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ

. పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


చిత్తూరు జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాల్లో 1,938 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యుత్, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, రవాణా, పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయడం జరిగింది.


పరీక్షా కేంద్రాలు

శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, చిత్తూరు

మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, పలమనేరు

ద్రావిడియన్ యూనివర్సిటీ, కుప్పం

కుప్పం ఇంజినీరింగ్ కళాశాల, కుప్పం


పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దివ్యాంగ అభ్యర్థులకు అవసరమైన ప్రత్యేక సదుపాయాలు, వైద్య సహాయం అందుబాటులో ఉంచనున్నారు.

అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకుని, పరీక్షా నిబంధనలను పాటిస్తూ పరీక్షకు హాజరు కావాలని అధికారులు సూచించారు.

పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ సహకారంతో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు

అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతంగా పరీక్షలకు నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో డీఈఓ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులు ఉన్నారు



No comments:

Post a Comment