13 కోట్ల ఓటర్ల ను తొలగించిన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.
- కలెక్టరేట్ వద్ద వామపక్షాలు నిరసన
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ ఏకపక్షంగా రాజ్యాంగానికి విరుద్ధంగా దేశంలోని 13 కోట్ల మంది ఓటర్లను అక్రమంగా తొలగించడం దారుణమని కోట్లాదిమంది ప్రజలను ఇబ్బందులు పెడుతున్న సిఇసి వెంటనే రాజీనామా చేయాలని సోమవారం కలెక్టరేట్ వద్ద సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు లు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సభ్యులు కమిటీ ముగ్గురు ఉంటే మెజార్టీ సభ్యులు ఇద్దరు సభ్యులు సర్ ను వ్యతిరేకిస్తూ చెప్పినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా ఏకపక్షంగా దేశంలోని కోట్లాదిమంది ఓటర్లను ఇబ్బంది కలిగిస్తున్న, కలిగించిన జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్వతంత్ర సంస్థగా ఉన్న సిఈసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ అమిత్ షా ఏది చెప్తే అది చేసే విధంగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. కోట్లాదిమంది ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా వేలాదిమంది అధికారులను ఐఏఎస్ వారిని తప్పుడు పద్ధతిలో తప్పుదారి పట్టించడం దుర్మార్గమన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు తప్పించకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీన వేషాలు వేస్తూ కాలం గడుపుతున్నది. తప్పు బయటపడిన తర్వాత కొన్ని మార్పులు చేశామని చెప్తున్నారు.
అయితే మొదట ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పిన వీళ్లు ఇప్పుడు కొన్ని మార్పులు చేశారంటే తప్పు చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జ్ఞానేశ్వర్ కుమార్ను రాజీనామా చేయాలని పోరాటాలు జరుగుతుంటే సమస్య పరిష్కారం చేయకుండా ఆ పోరాటాన్ని ఎలా అణచాలని పోలీసులు ద్వారా ఉద్యమాలను అణచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రోజురోజుకీ వ్యతిరేకత రావడంతో అడ్డదారుల్లో గెలుస్తూ వస్తున్న వీరు ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుని వారికి వ్యతిరేకమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. వారు ఏది చెప్తే అదే తల ఊపే సిఈసీని వెంటనే తొలగించాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్ర గిరిధర్ గుప్తా ఓబుల్ రాజు నాయకులు సందీప్ ఉమాపతి ప్రతాప్, సిపిఐ నాయకులు దాసరి చంద్ర మనీ విజయ గౌరీ రమాదేవి విజయ్ కుమార్,రఘు, లతోపాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

No comments:
Post a Comment