గోవిందరాజుల గుట్ట ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే భారీ విరాళం
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు రూరల్ ఫస్ట్ న్యూస్ 4 యు:
చిత్తూరు రూరల్ మండలం దిగువమాసాపల్లి పరిధిలోని శ్రీ గోవిందరాజులగుట్టపై వెలసిన శ్రీవారి పాదాల వద్ద పెరటాసి నెల మూడవ శనివారం పురస్కరించుకొని నిర్వహించిన కల్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు అభిషేకం, పూజల నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ఉత్సవాన్ని తిలకించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ కమిటీ సభ్యులు విన్నపం మేరకు.. ఆలయం అభివృద్ధికి తనవంతుగా రూ.6కోట్ల మేర విరాళం ఇస్తామని ప్రకటించారు. తితిదే నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ముందస్తు డిపాజిట్ కోసం నిధులు అందిస్తామని చెప్పారు. స్థానిక నాయకులు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చంద్ర ప్రకాష్, జయచంద్ర నాయుడు, రఘు, మనోజ్, మోహన్, గిరి, బాబు, జగదీశ్వర నాయుడు, రాజేంద్ర నాయుడు, సుధా, కుమార్, నీరజాక్షులు నాయుడు, గ్రీష్మ, సురేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment