హత్యాయత్నం కేసులో ఏడాది కాలంగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నం.149/2025 U/s 85, 109(1), 118(1), 115(2), 351(2) r/w 3(5) BNS కేసులో గత సంవత్సరం కాలంగా పరారీలో ఉన్న A2 నిందితుడు T. సందీప్, వయస్సు 23 సంవత్సరాలు, S/o T. చిన్న రెడ్డప్ప, నివాసం మోతుకుపల్లి గ్రామం, హ/o పాలేరు, బంగారుపాళ్యం మండలం, స్వస్థలం మొగిలి వెంకటగిరి గ్రామం, బంగారుపాళ్యం మండలంను పోలీసులు అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, పలమనేరు DSP శ్రీ D. ప్రభాకర్ గారి పర్యవేక్షణలో, బంగారుపాళ్యం UPS ఇన్స్పెక్టర్ శ్రీ కత్తి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, బంగారుపాళ్యం UPS SI శ్రీ T. ప్రసాద్ మరియు వారి సిబ్బంది పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో 05-10-2026 రాత్రి నిందితుడు **T. సందీప్ (A2)**ను గుర్తించి అరెస్ట్ చేశారు.
గత సంవత్సరం కాలంగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.

No comments:
Post a Comment