Saturday, 10 October 2026

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య.

 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య.


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

 వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిని పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఆరోగ్యశాఖలో గత 30 సంవత్సరాలుగా వివిధ కేడర్లలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని  గడచిన ఐదు రోజులుగా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు వారికి మద్దతుగా శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శివయ్య కార్యవర్గం చిత్తూరులోని దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి యూనియన్ తరపున మద్దతు ప్రకటించారు.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శివయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం వారు ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ కిందనే పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఏపీపీఎస్సీ ద్వారాను రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని ఇది కాంట్రాక్టు వారికి తీరని అన్యాయం అన్నారు. కనుక వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సత్వరం రెగ్యులర్ చేయాలని అలాగే పనికి తగ్గ వేతనాన్ని వారికి అందించాలని కోరారు.

No comments:

Post a Comment