Saturday, 17 October 2026

చిత్తూరు నగరపాలక సంస్థలో నామినేషన్ స్వీకరణ పరిశీలించిన జిల్లా కలెక్టర్

పురపాలక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు* 
నామినేషన్ ప్రక్రియలో లోపాలు లేకుండా చూడాలి.
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్






చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 17:

పురపాలక ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, అందుకు అనుగుణం గా ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తదుపరి అధికారులతో సమావేశం అయ్యారు. పురపాలక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలంటే అధికారులు బాధ్యతతో అలసత్వం లేకుండా పనిచేయాలని కలెక్టర్ హెచ్చరించారు. 

ఎన్నికల నిర్వహణకు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లో సంబంధించి 15 స్వర్ణ వార్డు కార్యాలయాలలో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు మేయర్ స్థానానికి నామినేషన్ వేసే అభ్యర్థులు చిత్తూరు నగరపాలక కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నామినేషన్ అందజేయాలి.RO కార్యాలయాన్ని పరిశీలించారు 

 ఎలాంటి లోపాలకు తావు లేకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ  కమిషనర్ నరసింహ ప్రసాద్, ఆర్వో పుల్లారెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment