చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
13-09-2026వ తేదీ రాత్రి చిత్తూరు టౌన్ బజార్ వీధిలోని రమేష్ నూనె అంగడిలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, షాపు మౌల్డ్‌లో వెలుతురు కోసం ఏర్పాటు చేసిన అడ్డమును పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. షాపులో ఉన్న ఒక ల్యాప్‌టాప్‌తో పాటు రూ.20,000/- నగదును దొంగిలించి పరారయ్యారు.
ఈ ఘటనపై చిత్తూరు I టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి పర్యవేక్షణలో, చిత్తూరు SDPO శ్రీ జె. వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో, చిత్తూరు I టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. చిన్న పెద్దయ్య దర్యాప్తును ముమ్మరం చేశారు.
దర్యాప్తులో భాగంగా చోరీకి పాల్పడిన నిందితుడు జీ. హేమంత్‌ను 01-10-2026వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు టౌన్‌లోని పి.వి.కె.ఎన్. కళాశాల వెనుక వైపు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి రూ.10,000/- నగదును రికవరీ చేశారు.
అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం చిత్తూరు గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
*ముద్దాయి వివరాలు:*
జీ. హేమంత్‌ను, వయస్సు – 21, చిత్తూరు పట్టణం, చిత్తూరు జిల్లా.

No comments:
Post a Comment