Tuesday, 6 October 2026

తవణంపల్లిలో నాఖాబంది.. 28 వాహనాలకు జరిమానా

 తవణంపల్లిలో నాఖాబంది.. 28 వాహనాలకు జరిమానా


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

తవణం పల్లి మండల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్సై రమేష్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని 28 వాహనదారులకు జరిమానాలు విధించారు.

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎస్సై రమేష్‌బాబు సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపరాదని, హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ రక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. వాహనదారులు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.

No comments:

Post a Comment