వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
- జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 09 :
జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా, పంపిణీ, నిల్వలు తదితర అంశాల పై జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని నాగార్జున ఐ ఏ ఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల లభ్యత, వినియోగదారులకు సకాలంలో సరఫరా, బుకింగ్లకు అనుగుణంగా డెలివరీ తదితర అంశాలపై చర్చించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏజెన్సీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పాటించాలని, గ్యాస్ సరఫరాకు సంబంధించి వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మన ప్రోగ్రెస్ చూస్తే స్టేబుల్ గా ఉందని, ఇప్పుడు మళ్ళీ తగ్గిందని, స్టేట్ యావరేజ్ కన్నా మనది తక్కువ వచ్చిందని, ఐ వి ఆర్ ఎస్ ఫీడ్ బ్యాక్ కూడా ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. సివిల్ సప్లైస్ అధికారులు లబ్దిదారులతో కూర్చో పేటి ఏజెన్సీలతో స్వయంగా మాట్లాడి వారి యొక్క ఫీడ్ బ్యాక్ ను తీసుకోవడం జరుగుతోంది. డెలివరీ బాయ్స్ ను లబ్దిదారులతో మంచిగా మాట్లాడే విధంగా చూడాలని తెలిపారు. లబ్దిదారులు గ్యాస్ ఏజెన్సీ వారి వద్దకు వచ్చి ఏదైనా సందేహాలు మరియు సబ్సిడీ డబ్బులు పడలేదని వేరే ఏమైనా అడిగితే సరైన సమాధానం ఇస్తూ మంచిగా మాట్లాడాలని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల నిల్వలు, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్ల విక్రయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులకు నిర్ణీత నిబంధనల ప్రకారం గ్యాస్ సరఫరా అందేలా సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎల్.వెంకటరాముడు, సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment