Monday, 5 October 2026

బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసింది తెదేపానే

బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసింది తెదేపానే

* బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు.

* ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, మురళీమోహన్ 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వమేనని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, కె.మురళీమోహన్ లు చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే బీసీలకు రాజ్యాధికారం దక్కకూడదనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. సోమవారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్ లో కూటమి పార్టీల నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైకాపా పార్టీ పైకి బీసీలపై కపట ప్రేమను చూపిస్తూ.. లోపల బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి రాజ్యాంగ పదవులను ఇచ్చింద తెదెపా, కూటమి ప్రభుత్వమేనన్నారు.  ఎవరు ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు సృష్టించినా బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. న్యాయపరంగా ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో 34 శాతం రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు చారిత్రాత్మక ద్రోహం చేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మా సంకల్పం మారదని, బీసీలకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామన్నారు. బీసీలకు 34 శాతం  రిజర్వేషన్లు ఇస్తే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందనే కుట్రతో గొడ్డలి పార్టీ నేతలు న్యాయస్థానంలో పిటిషన్లు వేసి బీసీలకు తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం ఇవ్వకపోవడం వల్ల 16,800 మంది పదవులు కోల్పోయారని,  ఇప్పుడు కూడా పదవులు రాకూడదన్న కుట్రతో కోర్టుకు వెళ్లి నిస్సిగ్గుగా అడ్డుకున్నారన్నారు. అన్ని వర్గాల హక్కులను కాపాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను బీసీలకు పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తుంటే గొడ్డలి పార్టీ నేతలు మాత్రం కుట్రలు చేస్తున్నారన్నారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీల అభ్యున్నతి కోసం మేం ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కి తగ్గమని, హైకోర్టు తీర్పును గౌరవిస్తూ బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఇది కేవలం రిజర్వేషన్ల అంశం మాత్రమే కాదని,  బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాధాన్యతని ఎమ్మెల్యేలు చెప్పారు. నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి 1987లో 20 శాతం, 1995లో 34శాతం రిజర్వేషన్లు కల్పించామని... బీసీలకు రాజకీయ సాధికారత అనేది టీడీపీ డీయన్ఏ లోనే ఉందన్నారు. సమావేశంలో కూటమి పార్టీల నాయకులు బీఎన్ రాజసింహులు, త్యాగరాజన్, సీకే లావణ్య, చైతన్య, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేశ్ యాదవ్, యస్వంత్, చిట్టిబాబు, దీపశ్రీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment