ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి*
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
రాజకీయ పార్టీలు, MPTC/ZPTC అభ్యర్థులకు
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబరు 19
ఎంపీ టీసీ, జడ్పీటీసీ స్థానాల పోరుకు సోమవారం నోటిఫికేషన్ వెలువడ నుంది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి మండలాల వారీగా రిట ర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు
అనంతరం 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబరు 3న ఎన్నికలు, నవంబరు 5న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉంది.
జిల్లా పరిషత్తు పోరుకు సంబంధించి మండలానికి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా మండల కేంద్రా ల్లోని రిటర్నింగ్ అధికారి వద్ద నామినే షన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జడ్పీ టీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని జిల్లాపరిషత్తు కార్యాల యంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఎన్నికల వ్యయ పరిమితులు:*
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిర్ణీత వ్యయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎంపీటీసీ సభ్యుల అభ్యర్థులకు గరిష్ఠ ఎన్నికల వ్యయ పరిమితి రూ.4 లక్షలు కాగా, జెడ్పీటీసీ సభ్యుల అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించారు.
*సెక్యూరిటీ డిపాజిట్ వివరాలు:*
ఎంపీటీసీ సభ్యుల అభ్యర్థులకు జనరల్/ఇతర కేటగిరీలకు రూ.3,000, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. జెడ్పీటీసీ సభ్యుల అభ్యర్థులకు జనరల్/ఇతర కేటగిరీలకు రూ.6,000, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు రూ.3,000 సెక్యూరిటీ డిపాజిట్‌గా నిర్ణయించారు.
జరగనున్న స్థానిక సంస్థల MPTC/ZPTC ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేయనున్న అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లాలో 370 ఎంపీటీసీ స్థానాలు, ఇరవైడు జడ్పిటి స్థానాలకుఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ఆయా మండలంలో తహశీల్దారును అధికారిగా నియమించినట్లు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలోఅక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు MPTC ఎన్నికల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారని పేర్కొన్నారు.
అక్టోబర్ 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన,
అక్టోబర్ 27వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి, అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలిపారు.
నామినేషన్ కేంద్రంగా ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీల ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మైకుల ద్వారా ఎన్నికల ప్రచారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని, ఇందుకు పోలీసుల లేదా రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ర్యాలీలు, సభలు, వాహనాల వినియోగానికి కూడా ముందస్తు అనుమతి తప్పనిసరని తెలిపారు. కాలినడకన ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేక అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని ఏర్పాటు చేయరాదని, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వంటి ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని సూచించారు. మతం, కులం ఆధారంగా ఓట్లు కోరడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలపై నిరాధార ఆరోపణలు చేయడం నిషిద్ధమని తెలిపారు.
వ్యక్తుల ఇళ్ల ముందు వారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించరాదని సూచించారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రవర్తనా నియమావళిని పూర్తిగా చదివి, దాని ప్రకారం వ్యవహరించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులు ఉంటే రిటర్నింగ్ అధికారి లేదా తహశీల్దారును సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఎన్నికల అధికారులు, సిబ్బందికి రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు సహకరించి, జిల్లాలోని వివిధ మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రకటనలో తెలిపారు.

No comments:
Post a Comment