Monday, 12 October 2026

14 న బంగారుపాలెం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం - సీఐ కత్తి శ్రీనివాసులు

 14 న బంగారుపాలెం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం 

- సీఐ కత్తి శ్రీనివాసులు 


చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

ఈనెల 14వ తేదీన చిత్తూరు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఏ.ఆర్ పోలీసు కార్యాలయంలో బంగారుపాళ్యం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందని బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ సిఐడి అధికారుల సూచనల మేరకు బంగారుపాలెం మండలంలో అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను సేకరించామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సాయిద దళాల కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా బంగారు పాలెం మండలానికి చెందిన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన 14వ తేదీన ఉంటుందని, కావున సంబంధిత బాధితులు తప్పకుండా 14వ తేదీ సాయుధ దళాల కార్యాలయం లో హాజరై వారి యొక్క బాండ్లను సమర్పించి పరిశీలన చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు

No comments:

Post a Comment