అంగన్వాడి సూపర్వైజర్లు బాధ్యతగా పనిచేయాలి
సిడిపిఓలు క్షేత్రస్థాయిలో అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలి
బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 6:
సిడిపిఓలు క్షేత్రస్థాయిలో అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం స్థానిక జడ్పీ కార్యాలయంలోని సీఈఓ ఛాంబర్ నందు జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అంగన్వాడి కేంద్రాల పనితీరుపై సిడిపిఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఇన్చార్జి ఐ సి డి ఎస్ పి డి శ్యామ్ సుగుణ కుమారి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు మంచి పోషక ఆహారాలు అందించాలని ఆదేశించారు. అతి తక్కువ బరువుతో ఉన్న పిల్లలకు మరియు అతి తీవ్ర పోషకాహారం లోపం పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి ఆహారం అందించాలని ఆదేశించారు ఐదు సంవత్సరంలోపు ఉన్న పిల్లలకు ఎత్తు బరువులు తూయడం ద్వారా వారు ఎదుగుదలను పర్యవేక్షించాలని బాధ్యత మీ పైన ఉన్నదని ఆదేశించారు, అంగన్వాడి కేంద్రాలలో పనిచేసే అంగన్వాడి కార్యకర్త పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు, జిల్లాలో ఉన్న ప్రతి అంగన్వాడి సూపర్వైజర్ సగటున పదిమంది పిల్లలను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు. రేపటి రోజు అన్ని శాఖల సమయంతో అంగన్వాడి కేంద్రాల అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు, జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడి కేంద్ర భవనాలను నిర్మించడానికి నిధులు ఎంత అవసరమో నివేదికల సిద్ధం చేయాలని CDPO లను ఆదేశించారు, క్షేత్రస్థల్లో మీరు పర్యటించినప్పుడు అంగన్వాడి కేంద్రాల్లో సరుకులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు, నాణ్యమైన, పోషక ఆహార విలువలు అందజేసినప్పుడే సమాజంలో మీకు గౌరవంగా ఉంటుందని తెలిపారు, మీరు సక్రమంగా మీ శాఖలో విధులు నిర్వహిస్తే జిల్లా ఒక మంచి పేరు వస్తుందని తెలిపారు
అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలు, మరుగుదొడ్లు మరియు తాగునీటి కనెక్షన్ల పరిస్థితిని సమీక్షించి, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
నవచేతన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న AI స్క్రీనింగ్ పురోగతిని సమీక్షించి, అర్హులైన పిల్లలందరికీ స్క్రీనింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) కింద లబ్ధిదారుల నమోదు, పథకం అమలు మరియు మానిటరింగ్‌పై సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులందరూ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాలలో పేద పిల్లలు ఎక్కువగా ఉంటారని వారిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలించడంపై విస్తృతంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు విధులు పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు పోషణ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమర్థవంతంగా చేరేలా CDPOలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుప్పం , శాంతిపురం, బైరెడ్డిపల్లి, పలమనేర్, చిత్తూరు, ఐరాల, పులిచెర్ల, GD నెల్లూరు, కార్వేటినగరం, బంగారు పాల్యం, CDPO లు పాల్గొన్నారు.


No comments:
Post a Comment