Thursday, 29 October 2026

విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందించాలి - మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్

 విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాన్ని   పెంపొందించాలి 

- మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ 







చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:

విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాన్ని   పెంపొందించాలని చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ అన్నారు. గురువారం గంగా కాలనీలోని MPPS పాఠశాలను ఆయన సందర్శించారు.5 వ తరగతి విద్యార్థులలో ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్ , గణితము, తెలుగు వంటి సబ్జెక్టుల్లో విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు.  పలు ప్రశ్నలు వేసి వారి నుండి సమాధానాలు రాబెట్టారు. అనంతరం పాఠశాల భవనంను పరిశీలించి తుఫాను ప్రభావంతో విద్యార్థులకు ఎలాంటి అపాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం రోజువారి మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందించాలని నాణ్యతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

No comments:

Post a Comment