Tuesday, 6 October 2026

అప్పుల బాధ తట్టుకోలేక ఉరివేసుకుని వ్యక్తి మృతి

 అప్పుల బాధ తట్టుకోలేక ఉరివేసుకుని వ్యక్తి మృతి

చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లి గ్రామంలో అప్పుల బాధతో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో Cr.No.163/2026 U/Sec.194 BNSS కింద కేసు నమోదు చేయబడింది.మృతుడు మాణిక్యం ఆచ్చారి కుమారుడు వి.నారాయణ ఆచారి (50),జంబువారిపల్లి గ్రామం. ఇతను తగ్గువారిపల్లిలోని విఘ్నేశ్వర వుడ్ వర్క్ షాప్‌ను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాడు.సుమారు రూ.20 లక్షల అప్పులు, ఆర్థిక ఇబ్బందులు మరియు షాప్ లీజు గడువు ముగియడంతో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.05-10-2026న మధ్యాహ్నం భోజనం అనంతరం షాప్‌కు వెళ్లిన మృతుడు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో, అతని భార్య లత షాప్‌లో పనిచేసే శంకర్‌ను సంప్రదించింది.శంకర్ షాప్‌కు వెళ్లి చూడగా,మృతుడు షెడ్‌లోని ఇనుప పైపునకు వైర్‌తో ఉరి వేసుకుని కనిపించాడు.వెంటనే లత,శంకర్,సాంబయ్య ఆచారి కలిసి మృతుడిని కిందకు దించి బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

మృతుడి భార్య వి.లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు ను ఎ ఎస్సై జి.నరసింహులు దర్యాప్తు చేస్తున్నారు.




No comments:

Post a Comment