అంగన్వాడీల జోలికొస్తే ఖబడ్డార్
చలో ఢిల్లీని జయప్రదం చేయండి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ
చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు:
రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకుండా అధికార పార్టీ అధికారులతో ప్రలోభాలకు పెట్టి భయపెట్టే పని చేయడం దుర్మార్గమని అంగన్వాడీల జోలికొస్తే ఖబడ్డార్ అని సోమవారం చిత్తూరు జిల్లా అంగన్వాడీల జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ హెచ్చరించారు. ఈ సమావేశం యుటిఎఫ్ కార్యాలయంలో కె.పి.లలిత అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బరావమ్మ హాజరై మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా అడ్డదారుల్లో బెదిరింపులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో 42 రోజులు అంగన్వాడీలు చారిత్రాత్మకమైన సమ్మె చేయగా ఆ సమస్య సందర్భంగా మినిస్ట్రీల కమిటీ మినిట్స్ రాసి వేతనాలు పెంచుతామని ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కోసం మళ్లీ పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్రులు అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నది అయినా వేతనాల జోలికి వెళ్లడం లేదు. పోరాటాల సందర్భంగా ఒక ట్రెండు సమస్యలు పరిష్కారం చేసి మేము చేసాం మా యూనియన్ లో చేరండి అని చెప్పడం వారి అవివేకం. గతంలో అనేక పోరాటాలు చేసినప్పుడు తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఒక్కరోజు కూడా అంగన్వాడీలకు మద్దతుగా మాట్లాడిన వారు కాదు. ఇప్పుడు మేము చేసేస్తాం చేస్తాం అంటే అంగన్వాడీలు అంత అమాయకులు కాదని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాన్ని రద్దుచేసి రాష్ట్రంలోని కార్మికులకు అన్యాయం చేస్తుంటే మాట్లాడన వారు అంగన్వాడీలకు న్యాయం చేస్తారా అది నమ్మాలా అని ప్రశ్నించారు. అంగన్వాడీలకు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకో యాప్ తీసుకువచ్చి పని భారం పెంచుతున్నారని మానుకోవాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, అంగన్వాడి యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు లు మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాజెక్టుల్లో కొంతమంది అధికారులు అంగన్వాడీలను అధికార పార్టీ సమావేశాలకు పంపడం చట్టవిరుద్దమన్నారు. ప్రాజెక్టులలో అనేక రకాల సమస్య ఉన్నాయని వాటిపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
*చల్లో ఢిల్లీని జయప్రదం చేయండి*
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి వేతనాలు పెరగకుండా అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకంగా దేశంలోని కార్మిక వర్గం ఢిల్లీని స్తంభింప చేయడానికి డిసెంబర్ 1, 2, 3 చలో ఢిల్లీ కార్యక్రమం లక్షలాది మందితో సిఐటియు చేపట్టందని ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అంగన్వాడీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో అంగనవాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలా ,కోశాధికారి విజయ జిల్లా నాయకులు సరళ, శోభ ,షీలా, శైలజ, గోవిందమ్మ, కస్తూరి, మైధిలి, జమున, మమత, లతోపాటు అంగన్వాడీలు పాల్గొన్నారు.

No comments:
Post a Comment