Monday, 12 October 2026

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన - బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు

 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన 

- బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు 



చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు: 

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో రాబోయే జడ్పిటిసి ఎంపిటిసి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం బంగారుపాళ్యం సిఐ కత్తి శ్రీనివాసులు తన బృందంతో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారుపాళ్యం మండల కేంద్రం పరిధిలోని తుంబ కుప్పం, ఈచనేరి, కరిడి వారి పల్లి, నల్లం గాడు వంటి కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తన బృందంతో కలిసి పరిశీలించామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం పైన స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన చర్యలు చేపడతామన్నారు. అవసరమైన చోట గట్టి పోలీసు బందోబస్తుతో నిఘా నేత్రాల నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. 

No comments:

Post a Comment