Thursday, 29 October 2026

నవంబర్ 5వ తేదీన జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎన్నికల నిర్వహించడం జరుగుతుంది : జిల్లా ఎన్నికల అధికారి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

బ్యాలెట్  పేపర్లను జాగ్రత్తగా పరిశీలించాలి

కౌంటింగ్ అరేంజ్మెంట్స్ క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి

రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, జడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకే మీ విధులు నిర్వర్తించాలి

నవంబర్ మూడో తేదీ లోపు పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అన్నియు సిద్ధం చేసుకోవాలి

నవంబర్ 5వ తేదీన జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎన్నికల నిర్వహించడం జరుగుతుంది

జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్




చిత్తూరు ఫస్ట్ న్యూస్ 4 యు అక్టోబర్ 29:


రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, జడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకే మీ విధులు నిర్వర్తించాలి అని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జడ్పీ కార్యాలయంలోని సమావేశం మందిరంలో  ZPTC/MPTC ఎన్నికలకు  సంబంధించిన RO, లతో  ఇతర అధికారులకు ఎన్నికల వేళ అనుసరించాల్సిన తీరు, విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 

జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్,

డిఆర్ఓ కే మోహన్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేష్,ZP CEO రవికుమార్ నాయుడు, ఎంపీడీవోలు, ARO  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

 కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసి, రిటర్నింగ్ అధికారులు (ROలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROలు), కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది తమకు కేటాయించిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్‌ను నియమించి, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.


ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి మండలాల వారీగా కౌంటింగ్ గదులు, టేబుళ్లను ముందుగానే సిద్ధం చేయాలని, జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు తెలుపు రంగులో, ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులో ఉండే విధంగా వాటిని గుర్తించి వేర్వేరుగా విభజించి సంబంధిత కౌంటింగ్ టేబుళ్లకు పంపిణీ చేయాలని తెలిపారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న మండలాల్లో అవసరాన్ని బట్టి సమాంతర కౌంటింగ్ నిర్వహించి, ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన వెంటనే తదుపరి రౌండ్‌ను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అభ్యర్థులు, వారి అధీకృత కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలన్నారు.


ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన ఉద్యోగులు, పోలీసు సిబ్బంది తదితరులు నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.


పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పూర్తయిన వెంటనే పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి అధీకృత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ పేపర్లను పరిశీలింపజేసి, ముద్రణ, నంబరింగ్ తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్ధారించుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత సురక్షిత గదిలో భద్రపరిచి, నిబంధనల ప్రకారం సీల్ వేయాలని, సీసీటీవీ నిఘా మరియు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని ఆదేశించారు.


అలాగే, ఎన్నికలకు ముందుగానే స్ట్రాంగ్ రూమ్‌లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీటీవీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నియంత్రణ తదితర అంశాలను సంబంధిత అధికారులు తనిఖీ చేయాలన్నారు.


సాధారణ బ్యాలెట్ పేపర్ల ముద్రణను ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనా, మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ముద్రణ అనంతరం రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు, నంబరింగ్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సంఘం, న్యాయస్థానాల మార్గదర్శకాలను పాటిస్తూ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఓ బ్యాలెట్ బాక్సుల తరలింపు, బ్యాలెట్ తరలింపు, పోలింగ్ మెటీరియల్ వినియోగం, సరిచూసుకోవడం, మాకోపోలింగ్, నియమాలు, ఏజెంట్ల విషయం లో నియమ నిబందనలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆర్వోలు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment